Pushpa Stampede: అల్లు అర్జున్ పుష్ప 2 తొక్కిసలాట.. NHRC సీరియస్
ABN, Publish Date - Aug 06 , 2025 | 04:16 PM
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ విడుదలైన అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన విషాద ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (National Human Rights Commission of India) స్పందించింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద 2024 డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై కమిషన్ తీవ్రంగా స్పందిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
నాగు జరిగిర దుర్ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. 146 రోజుల పాటు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం 2025 ఏప్రిల్ 29న డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి భద్రతా వైఫల్యం, పోలీసుల పాత్రపై కమిషన్ ఆందోళన వ్యక్తం చేస్తూ, పూర్తి విచారణ నివేదికను ఆరు వారాల్లో సమర్పించా లని సీఎస్ తో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, మరణించిన రేవతి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం అందించాలని సూచించింది. ఈ ఘటన తరువాత అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు.