Allu Arjun - Shiva: శివ సినిమా రీ రిలీజ్.. బన్నీ ప్రమోషన్స్..
ABN, Publish Date - Oct 25 , 2025 | 12:10 PM
కొన్ని చిత్రాలు వచ్చి ఎంత కాలమైనా ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటి చిత్రమే నటించిన ‘శివ’. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమా రీరిలీజ్ గురించి స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
కొన్ని చిత్రాలు వచ్చి ఎంత కాలమైనా ప్రత్యేకంగానే ఉంటాయి. అలాంటి చిత్రమే నటించిన ‘శివ’ (Shiva). రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రం విడుదలై టాలీవుడ్‌లో చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ ఆ సినిమా క్రేజ్ అలాగే ఉంది. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న ఈ తరుణంలో కొత్త టెక్నికల్ హంగులతో 4కె వెర్షన్‌లో (Shiva in 4K with Dolby atmos) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్ 14న ఈ సినిమా 4కే రీరిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ సినిమా రీరిలీజ్ గురించి స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
‘మన శివ సినిమా విడుదలై దాదాపు 36 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకే ఐకానిక్ సినిమా. ఈ ఒక్క సినిమా తెలుగు సినిమా, ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసింది. శివ సినిమాకు ముందు ఆ తర్వాత అనే గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఈ సినిమా డాల్మీ అట్మాస్, 4కె రిజల్యూషన్ వంటి హై టెక్నాలజీ వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మన క్లాసిక్ సినిమాను మిస్ కావొద్దు. మనం ఎంతగానో ప్రేమించే నాగార్జున గారి కోసం అక్కినేని అభిమానులతోపాటు అందరూ ఈసారి థియేటర్లకి రెండు లారీల పేపర్స్ తీసుకెళ్లండి’ అని వీడియోలో పేర్కొన్నారు.
రెండు లారీల థ్యాంక్స్ బన్నీ: నాగార్జున
ఆ వీడియోను కింగ్ నాగార్జున్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి ‘డియర్ అల్లు అర్జున్ రెండు లారీల థ్యాంక్స్ నీకు’ అని తెలిపారు. మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ల మధ్య జరిగే రాజకీయాలపై ఈ సినిమా తెరకెక్కింది. నాగార్జున సరసన అమల నటించారు. ఇందులో పాటలు, సీన్లు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉంటాయి.