సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: త్రివిక్రమ్ ని వదలని బన్నీ.. ఎన్టీఆర్ ని పక్కకు నెట్టేసి మరీ

ABN, Publish Date - Dec 24 , 2025 | 03:38 PM

అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప-ద రూల్'తో పలు రికార్డులు సృష్టించారు. ఆ సినిమా తరువాత బన్నీ నుండి ఎలాంటి మూవీ వస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించే భారీ చిత్రాన్ని అంగీకరించారు బన్నీ.

Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప-ద రూల్'తో పలు రికార్డులు సృష్టించారు. ఆ సినిమా తరువాత బన్నీ నుండి ఎలాంటి మూవీ వస్తుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలోనే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar) డైరెక్షన్ లో సన్ పిక్చర్స్ నిర్మించే భారీ చిత్రాన్ని అంగీకరించారు బన్నీ. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. అత్యంత భారీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పలువురు అందాల భామలు నటిస్తూ ఉండడం విశేషం. ఈ సినిమా బన్నీకి 22వ చిత్రం కాగా, అట్లీకి 6వ సినిమా అన్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉండడం మరింత విశేషం. ఈ మూవీ 2026లోనే వెలుగు చూస్తుందని ముందుగా వినిపించింది. అయితే హై టెక్నికల్ వేల్యూస్ తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో ఏడాదికి పైగా సమయం పడుతోంది. ఆ తరువాత బన్నీ నటించే చిత్రమేది అన్న ఆసక్తి కలగక మానదు. ఈ సినిమా కాగానే మరో రెండు చిత్రాల్లో అల్లు అర్జున్ నటించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ కు సన్నిహితుడైన బన్నీ వాస్ తెలిపారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి 2026 జూలై ప్రాంతంలో ఆరంభం కానుంది. మరో చిత్రం 2027 మార్చిలో మొదలు కానుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది ఎప్పుడు ఎలా పట్టాలెక్కనుందో అధికారికంగా నిర్మాతలు ప్రకటించ వలసి ఉంది.

బన్నీ అంగీకరించిన కొత్త సినిమాల్లో ఒకటి త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారికా అండ్ హాసినీ సంస్థ నిర్మించే పౌరాణిక చిత్రం అని తెలుస్తోంది. గతంలో ఈ కాంబోలోనే మైథలాజికల్ మూవీ అని వినిపించింది. తరువాత బన్నీ- అట్లీతో వెళ్ళడం వల్ల ఆ పౌరాణిక చిత్రం జూనియర్ యన్టీఆర్ ను వెదుక్కుంటూ వెళ్ళిందని అన్నారు. కానీ, ఇప్పుడు అది మళ్ళీ బన్నీ చెంతకే చేరడం విశేషం. ఎన్టీఆర్ ని పక్కకు నెట్టి మరీ ఆ ప్రాజెక్ట్ ని మళ్లీ దక్కించుకున్నాడు బన్నీ.

ఇక మరో మూవీ ఏదంటే బన్నీకి అనూహ్య విజయాలను అందించిన 'పుష్ప' సిరీస్ లో మూడో భాగంగా రానున్న 'పుష్ప- ద ర్యాంపేజ్' అని సమాచారం. ఏది ఏమైనా బన్నీ లైనప్ చూసి ఆయన అభిమానులు ఆనందంతో చిందులు వేస్తున్నారు. రాబోయే అల్లు అర్జున్ చిత్రాలన్నీ అలరిస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఏ మూవీతో ఏ తీరున బన్నీ ఫ్యాన్స్ కు పరమానందం పంచుతారో చూద్దాం.

Updated Date - Dec 24 , 2025 | 03:38 PM