Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్
ABN, Publish Date - Aug 31 , 2025 | 06:18 PM
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎంతో ఇష్టపడే నాన్నమ్మ అల్లు కనకరత్నం (allu kanakaratnam) గారు రెండు రోజుల క్రితం కన్నుమూయగా శనివారం అంత్యక్రియలు ముగిశాయి. ఈ నేపథ్యంలో తన నాన్నమ్మ మరణంతో బాధ పడుతున్న అల్లు అర్జున్ ఆదివారం సోషల్ మీడియా వేదిక X (Twitter) ద్వారా భావోద్వేగం చెందుతూ ఓ పోస్టు పెట్టారు.
“మా ప్రియమైన నాన్నమ్మ అల్లు కనకరత్నం గారు స్వర్గానికి చేరుకున్నారు. ఆమె చూపిన స్నేహం, సలహాలు, ఆప్యాయతలు ఎప్పటికీ మాకు గుర్తుండిపోతాయి. ఆమె స్మృతులు ప్రతి రోజూ మా హృదయాల్లో నిలిచిపోతాయి. మా పట్ల ప్రేమ, పరామర్శ చూపిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు. దూరంగా ఉన్నప్పటికీ మీ ప్రార్థనలు, మద్దతు మాకు అందాయి. అందరి ప్రేమకు కృతజ్ఞతలు.”
ఈ పోస్టును బట్టి.. అల్లు అర్జున్ తన పోస్టు ద్వారా తన కుటుంబంపై ఉన్న అభిమానాన్ని, నాన్నమ్మపై ఉన్న అనుబంధాన్ని మరోసారి వ్యక్తం అవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో అభిమానులు, సన్నిహితులు అందరూ అల్లు కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నారు.