సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bunny New Movie: బాసిల్‌కు బన్నీ గ్రీన్‌సిగ్నల్‌

ABN, Publish Date - Jun 14 , 2025 | 06:11 AM

పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు..

‘పుష్ప అంటే ఇంటర్నేషనల్‌’ అంటూ ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌లానే ఇప్పుడు ఆయన ఇమేజ్‌ కూడా ఇంటర్నేషనల్‌ లెవల్‌కు వెళ్లింది. దాంతో ఆయనతో సినిమాలు చేయబోయే దర్శకులు అంటూ రోజుకో పేరు తెరపైకి తెస్తున్నాయి సోషల్‌ మీడియా వర్గాలు. తాజాగా అల్లు అర్జున్‌ను డైరెక్ట్‌ చేయబోతున్న దర్శకుల జాబితాలో మలయాళ డైరెక్టర్‌ బాసిల్‌ జోసెఫ్‌ పేరు చేరింది. ఆయనతో ఓ సినిమా చేసేందుకు బన్నీ ఎస్‌ చెప్పారంటూ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. బాసిల్‌ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు బాగా నచ్చిందని, త్వరలోనే వీరి కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వస్తుందనేది ఆ వార్తల సారాంశం. బాసిల్‌ జోసఫ్‌ నటుడిగా, దర్శకుడిగా మలయాళ పరిశ్రమలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్నారు. అయితే అవేవీ అల్లు అర్జున్‌ స్థాయికి తూగేవి మాత్రం కావు. కాబట్టి ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 06:12 AM