Allu Arjun: బన్నీ - అట్లీ లేటెస్ట్ అప్‌డేట్.. ఇక ముంబైలోనే..
ABN, Publish Date - Jun 24 , 2025 | 05:38 PM
బన్నీ - అట్లీ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అల్లు అర్జున్ (Allu arjun) హీరోగా అట్లీ (atlee) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ ప్రాజెక్ట్‌గా సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ సినిమా గురించ తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెట్స్‌కి వెళ్లడమే తరువాయి. తొలి షెడ్యూల్‌ను ముంబయిలో చిత్రీకరించనున్నారట. మూడు నెలలపాటు అక్కడే షూటింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ షెడ్యూల్‌లో యాక్షన్ పార్ట్ చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత వీఎఫ్‌ఎక్స్ పనులను ప్రారంభించనున్నారని టాక్. ఆ తర్వాత టీమ్ అమెరికా వెళ్లనుందని సమాచారం. అయితే దీనిపై అఽధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె కథానాయికగా ఎంపికైంది. పునర్జన్మల కథాంశంతో ముడిపడిన సైన్స్‌ఫిక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం టీమ్ ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే పనిలో ఉంది.