Allu Arjun - Atlee: అల్లు అర్జున్ కసి అదే.. పెద్ద ప్లానే ఇది...
ABN, Publish Date - Jul 18 , 2025 | 09:53 PM
అల్లు అర్జున్ – అట్లీ (Atlee) సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ‘ఐకాన్’ (icon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే కలెక్షన్ల టార్గెట్ మాత్రం..
ప్రస్తుత కాలంలో సినిమా అంటే వంద కోట్లు, రెండు వందల కోట్లు అనే మాట మాయమైంది. కలెక్షన్ల విషయంలోనూ అంతే. భారీతనం పెరిగింది. సినిమా కాంబినేషన్‌లను బట్టి, స్టార్‌డమ్‌ను బట్టీ వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ పెరిగిపోతూనే ఉంది. హిందీ సినిమా ‘దంగల్’ రూ.2 వేల కోట్ల మార్క్ దాటింది. ఆ తర్వాత మరే భాషలోనూ ఆ మార్క్ దాటలేదు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ గట్టి ప్రయత్నాలు చేశాయి. కానీ వర్కవుట్ కాలేదు. పుష్ప– 2 (Pushpa 2).. 1600 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఆ కసితో ఇప్పుడు బన్నీ 2000 కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2 వేల కోట్ల మార్కును దాటాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఏ సినిమాకు అనుకుంటున్నారా? అల్లు అర్జున్ – అట్లీ (Atlee) సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే! ఈ చిత్రానికి ‘ఐకాన్’ (icon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా కోసం రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టారు. అయితే కలెక్షన్ల టార్గెట్ మాత్రం 2 వేల కోట్ల పైనే. పుష్ప 2 వసూళ్లని క్రాస్ చేయడమే ఈ మూవీ టార్గెట్.
'దంగల్' (Dangal) కలెక్షన్లను దాటేలా చూడాలని బన్నీ (allu arjun) ప్లాన్. అందుకే కథ నుంచి సినిమా రిలీజ్ చివరి డే ప్రమోషన్ వరకూ కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తున్నారట. బన్నీ సినిమా సూపర్ హిట్ కొడితే బాలీవుడ్‌లోనూ రీసౌండ్ ఖాయం అనేది టార్గెట్! అయితే ఇప్పుడు 2 వేల కోట్లు పెద్ద విషయం కాదు. అయితే దానికి కోసం బాలీవుడ్ తర్వాత ఓవర్సీస్ మార్కెట్‌పై మరింత దృష్టి పెట్టాలి. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల్లా.. జపాన్ వంటి దేశాల నుంచి మంచి వసూళ్లు తీసుకురావాలి. ఇప్పుడు ఈ రికార్ట్‌ను కొట్టాలనే దిశగా అట్లీ టీమ్ కృషి చేస్తుందట. పుష్ప సినిమాకు ప్రమోషన్ గట్టిగా చేశారు. ఇంటర్‌నేషనల్ ప్లేయర్స్ ఈ సినిమాను ప్రమోట్ చేశారు. ఇప్పుడు కూడా అదే పద్దతిని కాస్త ఉదృతిని పెంచేలా ప్రయత్నాలు చేయబోతున్నారట. మూవీ ప్రమోషన్స్ బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. మరి అట్లీ – అల్లు అర్జున్ టీమ్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.