Alcohol: సితారలో.. అల్లరి నరేశ్! ఆల్కహాల్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:22 AM
అల్లరి నరేశ్ తాజాగా మరో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
కామెడీ హీరో నుంచి క్రమక్రమంగా విలక్షణ నటుడిగా, అల్ రౌండర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తోన్న అల్లరి నరేశ్ (Allari Naresh) తాజాగా మరో విభిన్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌మెంట్స్ (Sithara Entertainments) బ్యానర్‌పై వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా గతంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా (Family Drama) అనే డిఫరెంట్ సినిమా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న మెహర్ తేజ్ ( Meher Tej) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.
ఈరోజు (సోమవారం) అల్లరి నరేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. నరేశ్ సరసన బోల్డ్ భామ రుహానీ శర్మ (Ruhani Sharma) కథానాయికగా నటిస్తోండగా గిబ్రాన్ (Ghibran Vaibodha) సంగీతం అందిస్తున్నాడు. అయితే.. ఈ సినిమాకు ఆల్కహాల్ (Alcohol) అనే పేరు ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ టైటిల్‌పై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో ప్రరటించనున్నట్లు మేకర్స్ వెళ్లడించారు.