Allari Naresh: ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో 'నరేష్ 65' షురూ
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:34 AM
అల్లరి నరేష్ హీరోగా కొత్త చిత్రం మొదలైంది. అయన హీరోగా చేస్తున్న 65వ సినిమా ఇది. చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.
అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా కొత్త చిత్రం మొదలైంది. అయన హీరోగా చేస్తున్న 65వ (Naresh 65)సినిమా ఇది. చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ - బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. శనివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో ఈ సినిమా లాంచ్ అయ్యింది. నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హర్ష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెయిన్‌స్ట్రీమ్ కామెడీ, డిఫరెంట్ ఆఫ్‌బీట్ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్ #Naresh65తో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోందని మేకర్స్ చెప్పారు. 'కామెడీ గోస్ కాస్మిక్' అని పోస్టర్ పై చెప్పడం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇందులో వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో నటిసున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. త్వరలో #నరేష్65 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.