సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Sobhita: సమంత పెళ్లి.. శోభితాకు క్షమాపణ చెప్పాలిందే

ABN, Publish Date - Dec 02 , 2025 | 01:30 PM

సెలబ్రిటీల జీవితాల్లో ఏది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం ఎవరి వల్ల కాదు. వారు ఎందుకు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడిపోతారో.. అనేది ఆ దేవుడికి, వారికి తప్ప ఇంకెవరికి తెలియదు.

Akkineni Sobhita

Akkineni Sobhita: సెలబ్రిటీల జీవితాల్లో ఏది ఎప్పుడు జరుగుతుంది అని చెప్పడం ఎవరి వల్ల కాదు. వారు ఎందుకు పెళ్లి చేసుకుంటారో.. ఎందుకు విడిపోతారో.. అనేది ఆ దేవుడికి, వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. అయితే.. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్న సమయంలో మరొకరు రావడంతోనే విభేదాలు మొదలవుతున్నాయి అనేది అందరూ నమ్మదగ్గ నిజం. కానీ, ఆ ఒక్కరు ఎవరు.. ? అనేది బయటకు వచ్చే వరకు మిస్టరీనే. ఇక అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) - సమంత (Samantha) విషయంలో ఆ ఒక్కరు శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) అని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

చై - సామ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు ఎంతో అన్యోన్యంగా కలిసి కనిపించారు. సడెన్ గా వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దానికి కారణం పెళ్లి బంధంలో ఉన్నప్పుడే చై.. మరో నటి శోభితాతో రిలేషన్ లో ఉన్నాడని మాట్లాడుకున్నారు. ఈ గొడవల వలనే సామ్.. అక్కినేని కుటుంబం నుంచి విడిపోయింది అని చెప్పారు. ఆ రూమర్ ఎంతవరకు వచ్చింది అంటే శోభితాను ఎంతో పచ్చిగా తిట్టేవరకు వచ్చింది. పచ్చిని కాపురంలో చిచ్చు పెట్టింది అని, ఛీఛీ డబ్బు కోసమే ఇలాంటి పని చేసిందని రకరకాలుగా మాట్లాడారు. కానీ, ఏరోజు కూడా శోభితా ఈ ట్రోల్స్ పై స్పందించలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య తమ లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు. శోభితాకు తానే ప్రపోజ్ చేసానని, విడాకులు అయ్యాక డిప్రెషన్ లో ఉన్న తనకు శోభితానే అండగా నిలిచింది అని చెప్పాడు. దీంతో అప్పటివరకు ఆమెపై ఉన్న నెగిటివిటీ కొంతవరకు తగ్గింది. అయినా సమంత కాపురం కూలడానికి కారణం ఆమె అని అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. సామ్ ఉండాల్సిన ప్లేస్ లో శోభితా ఉంటుంది.. అక్కినేని ఫ్యామిలీ ఇలానే చేస్తుంది అంతో ఆడిపోసుకున్నారు.

కట్ చేస్తే సమంత కూడా ఒక కాపురాన్ని కూల్చింది. రాజ్ నిడిమోరు - శ్యామాలి జంట పిల్లలతో కలిసి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 షూటింగ్ నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ నడిచిందని, ఆ విషయం చైకి తెలియడంతో అదే పెద్ద గొడవకు దారితీసి విడాకుల వరకు వెళ్లిందని టాక్. ఇక ఇప్పుడు సామ్ - రాజ్ పెళ్లి చేసుకున్నారు. శ్యామాలికి రాజ్ విడాకులు కూడా ఇవ్వలేదని అంటున్నారు.

ఈ లెక్కన శోభితాతో పోలిస్తే సామ్ చేసింది చాలా దారుణం. పెళ్లి బంధంలో ఉన్నప్పుడే మరొకరితో రిలేషన్ లో ఉండడం, విడాకులు తీసుకోకుండా ఉన్న వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం.. ఇవన్నీ తప్పే. ఈ విషయం చాలామంది నెటిజన్స్ గ్రహించారు. అంతకుముందు శోభితాను అన్న ప్రతి మాటను వారు వెనక్కి తీసుకుంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కానీ, కొంతమంది నెటిజన్స్ కానీ, అప్పుడు శోభితాను ట్రోల్ చేసినవారందరూ ఆమెకు క్షమాపణ చెప్పి తీరాలి అని డిమాండ్ చేస్తున్నారు. శోభితా చాలా మంచి అమ్మాయి అని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆమెను కాపురాలు కూల్చే వ్యక్తిగా చూపించారని.. సమంతనే విలన్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Updated Date - Dec 02 , 2025 | 01:47 PM