Ali: రాజేంద్రప్రసాద్‌ ఇష్యూ.. అలీ వివరణ

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:25 PM

నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ (Rajendra prasad Comments) ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో అలీని పిలుస్తూ మాట తూలిన సంగతి తెలిసిందే!

నటకిరిటీ రాజేంద్రప్రసాద్‌ (Rajendra prasad Comments) ఆదివారం హైదరాబాద్‌లో జరిగిని దర్శకుడు ఎస్‌.వి.కృష్ణారెడ్డి (SV Krishna Reddy) పుట్టినరోజు వేడుకలో అలీని పిలుస్తూ మాట తూలిన సంగతి తెలిసిందే! అయితే అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, పొరపాటున ఆయన మాట తూలిందని అలీ (Ali) పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఆ ఇష్యూకు సంబంధించిన వీడియోలను వైరల్‌ చేయవద్దని కోరారు. ‘‘రాజేంద్ర ప్రసాద్‌ మంచి ఆర్టిస్ట్‌. ఆయన ఇటీవల తన కుమార్తెను కోల్పోయిన విషయం మనకు తెలుసు. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. నా విషయంలో ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు. దయచేసిన ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పెట్టండి’’ అని అలీ వీడియోలో అన్నారు.



దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ఆయన సినిమాల్లో నటించిన నటీనటులంతా పాల్గొన్నారు. అలీ, ఓ నటిపై రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట వైరల్‌ అయ్యాయి. తన కామెంట్స్‌పై రాజేంద్ర ప్రసాద్‌ స్పందించారు. సోమవారం జరిగిన ‘షష్టిపూర్తి’ సక్సెస్‌ మీట్‌లో మాట్లాడారు. తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని, తానెప్పుడూ ఇతరులతో సరదాగా ఉంటానని, ఆ చనువుతో వచ్చిన మాటలేనని అన్నారు.  

Updated Date - Jun 02 , 2025 | 05:28 PM