సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: హాలీవుడ్ స్థాయి కోసం.. బన్నీ ప్లాన్ మాములుగా లేదుగా.. 

ABN, Publish Date - Aug 26 , 2025 | 03:51 PM

ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీలో సినిమా వచ్చినా అది పాన్‌ ఇండియా ప్రేక్షకులకు రీచ్‌ అవ్వాలి. అదే మేకర్స్‌ టార్గెట్‌. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, దంగల్‌, పీకే, కేజీఎఫ్‌ వంటి చిత్రాలు పాన్‌ ఇండిమా సినిమాకు రూట్‌ వేశాయి.

ఇప్పుడు ఏ సినిమా ఇండస్ట్రీలో సినిమా వచ్చినా అది పాన్‌ ఇండియా ప్రేక్షకులకు రీచ్‌ అవ్వాలి. అదే మేకర్స్‌ టార్గెట్‌. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌, దంగల్‌, పీకే, కేజీఎఫ్‌ వంటి చిత్రాలు పాన్‌ ఇండిమా సినిమాకు రూట్‌ వేశాయి. ఇప్పుడు సినిమాకు భాష, ప్రాంతం అనే సరిహద్దులు పూరిగా చెరిగిపోయాయి. ఇప్పుడు టార్గెట్‌ హాలీవుడ్‌. ఆ విస్తృత మార్కెట్‌ను అందిపుచ్చుకోవడం ఎలా? హాలీవుడ్‌ క్రిటిక్స్‌, గోల్డెన్‌ గ్లోబ్స్‌, ఆస్కార్‌ పురస్కారాల్లో గుర్తింపు పొందడం ఎలా అన్నది ఆలోచిస్తే.. భారతీయ సినిమా అంతర్జాతీయ మార్కెట్‌ వెనకబాటు నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో   ఎస్‌ఎస్‌.రాజమౌళి బృందం సఫలమయ్యారు. ఇంటర్‌నేషనల్‌ స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్‌కు క్రేజ్‌ తీసుకొచ్చి తెలుగు సినిమా మార్కెట్‌ను పెంచారు. గోల్డెన్‌ గ్లోబ్‌- హాలీవుడ్‌ క్రిటిక్స్‌ పురస్కారాలు దక్కించుకున్నారు. తదుపరి ఆస్కార్‌ స్టేజ్‌ మీద నిలిచి ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్‌ 29 చిత్రాన్ని హాలీవుడ్‌ స్థాయిలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఆ రేంజ్‌ తగ్గకుండా రిలీజ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారు. (Allu Arjun's business strategy)

ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (allu Arjun) కూడా అదే దారిలోకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. 'ఎఎ26' సినిమాను గ్లోబల్‌ మార్కెట్లో పరుగులు పెట్టించాలనే తపన తొలి నుంచి కనిపిస్తోంది. దానితోపాటు రూ.2000 కోట్లు వసూళ్లు రాబట్టాలని టార్గెట్‌ పెట్టుకున్నారు బన్నీ టీమ్‌. ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ- సైన్స్‌ ఫిక్షన్‌ కేటగీరీలో ఇంటర్‌నేషనల్‌ స్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తామని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. హాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు, వీఎఫ్‌ఎక్స్‌ సహా పలు విభాగాల్లో చేస్తుండడం సినిమాకు మరింత క్రేజ్‌ను తెస్తుంది. సినిమా ప్రమోషన్స్‌ విషయంలోనూ మేకర్స్‌ వినూత్న రీతుల్లో ప్లాన్‌ చేయనున్నారట. ప్రస్తుతం అట్లీ బృందం హాలీవుడ్‌ స్టూడియోతో కలిసి పని చేస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి కోనెక్ట్‌ మోబ్‌సీన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెగ్జాండ్రా ఇ విస్కోంటి ముంబైలో అడుగుపెట్టడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. రెండు దశాబ్థాలకు పైగా పలు స్టూడియోలతో పని చేసిన అలెగ్జాండ్రా అవతార్‌, డూన్‌, జురాసిక్‌ వరల్డ్‌, బార్బీ, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సహా వంద పైగా చిత్రాలకు పని చేశారు.  ముఖ్యంగా క్రియేటివ్ ప్ర‌మోష‌న్స్ ప‌రంగా అలెగ్జాండ్రా (Alexandra E. Visconti) సుప్ర‌సిద్ధులు. ఆమె మార్కెటింగ్ స్ట్రాట‌జీ  అల్లు - అట్లీ (Atlee) సినిమాకి ప్ర‌ధాన బ‌లంగా మార‌నుంద‌ని విశ్లేషకులు  చెబుతున్నారు. అలెగ్జాండ్రా ప్ర‌స్తుతం ముంబై ప‌రిశ్ర‌మ‌తో పాటు, ప్రాంతీయ భాషా చిత్రాల‌కు చెందిన దిగ్గ‌జాల‌తో క‌లిసి ప‌ని చేస్తార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ ని ఢీకొట్టే స‌త్తా భార‌తీయ సినిమాకి ఉంది. దీనిని ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత నిరూపించాల‌నే పంతం మ‌న పెద్ద హీరోల‌కు ఉంది. అల్లు అర్జున్ - అట్లీ బృందం చేస్తున్న ప్ర‌య‌త్నం పెద్ద స‌క్సెస‌వ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక‌పైనా భార‌తీయ చిత్రాల‌ మార్కెట్ రేంజును అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు, కొత్త దారి చూపించే బాధ్య‌త‌ను సౌత్ ప్ర‌ముఖులు తీసుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Updated Date - Aug 26 , 2025 | 03:51 PM