Alcohol: ఆల్కహాల్ టీజర్.. అల్లరి నరేశ్, సత్య ఆడేసుకున్నారుగా
ABN , Publish Date - Sep 04 , 2025 | 03:20 PM
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం ఆల్కహాల్ టీజర్ గురువారం విడుదలైంది.
అల్లరి నరేశ్ (Allari Naresh) హీరోగా రుహానీ శర్మ (Ruhani Sharma), నిహారిక (Niharika NM) కథానాయికలుగా ప్రముఖ సితార ఎంటర్‌టైన్‌మెంట్ (Sithara Entertainments) బ్యానర్లో తెరకెక్కిన చిత్రం అల్కహాల్ (Alcohol ). గతంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా (Family Drama) అనే డిఫరెంట్ సినిమా తెరకెక్కించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న మెహర్ తేజ్ ( Meher Tej) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. జిబ్రాన్ (Ghibran), చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీతం అందించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి సడన్‌గా టీజర్ విడుదల చేసి సర్‌ఫ్రైజ్ ఇచ్చారు మేకర్స్.
గురువారం విడుదల చేసిన ఈ టీజర్‌ను పరిశీలిస్తే అల్లరి నరేశ్ ఈ మారు గ్యారంటీగా హిట్టు కొడతాడనే లెవల్‌లోనే ఉంది. ఓ భారీ సాఫ్ట్‌వేర్ కంపెనీని నిర్వహించే సత్య తన దగ్గర పని చేసే నరేశ్‌ను మందు ఎందుకు తాగవురా అనడం అందుకు ఆయన తాగితే అది మనల్ని తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది అందుకే దానికి దూరంగా ఉంటా అని చెప్పే డైలాగులు, సత్య నరేశ్‌ల మధ్య వచ్చే కన్వర్జేషన్, వారి హావాభావాలు కడుపుబ్బా నవ్వులు పూయించేలా ఉన్నాయి. టేకింగ్ సైతం డిఫరెంట్‌గా ఉంది.
ఆపై కాసేపటికి ఇద్దరి స్థానాలు ఎక్చేంజ్ అవడం నరేశ్ తన ఐదుగురు మిత్రలను తాగడానికి పిలవడం ఆపై జరిగే పరిణామాలతో చాలా ఇంట్రెస్టింగ్‌గా టీజర్ కట్ చేశారు. అయితే టీజర్ ఆద్యంతం నరేశ్, సత్యల నడుమనే సాగుతూ ఆకట్టుకోగా సినిమా కూడా వారిద్దరి కాంబినేషన్ ఇలానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అసలు సినిమా స్టోరీ ఏంటి, కాన్సెప్ట్ ఏమై ఉంటుంది అనే విషయాలు తెలియక పోవడం ప్రేక్షకులను గందరగోళంలో పడేసే అవకాశం ఉంది. ఇక ఈ అల్కహాల్ (Alcohol ) సినిమాను నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.