భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం

ABN, Publish Date - Aug 12 , 2025 | 06:54 PM

భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం 1/5

సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న‘కాంత’ (Kantha) చిత్రంతో యంగ్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కోలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు.

భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం 2/5

వేఫేరర్‌ ఫిలిమ్స్‌ సహకారంతో స్పిరిట్‌ మీడియా నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని ముఖ్య పాత్ర పోషించారు. మద్రాస్‌ మహానగరంలో 1950నాటి సంస్కృతి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం 3/5

ఈ ఎంట్రీ గురించి భాగ్యశ్రీ మాట్లాడుతూ, ‘కాంత’తో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా సినీ కెరీర్‌కు అత్యంత ప్రత్యేకమైనది. దుల్కర్‌, సముద్రఖని వంటి సీనియర్‌ ఆర్టిస్టులతో కలిసి ఈ అందమైన కథకు ప్రాణం పోయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం 4/5

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో మేము ఎంతగానో ఎంజాయ్‌ చేశాం.. అదే అనుభూతిని ప్రేక్షకులు కూడా పొందుతారు. మున్ముందు కోలీవుడ్‌ ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.

భాగ్యశ్రీ బోర్సే కోలీవుడ్ ఎంట్రీ ఖాయం 5/5

ఇదిలాఉంటే భాగ్య శ్రీ న‌టించిన కింగ్డ‌మ్ (Kingdom) ఇటీవ‌లే విడుద‌లై హిట్ అవ‌గా ఆంధ్రా కింగ్ తాలుఖా (Andhra King Taluka), అల్లు అర్జున్ ,అట్లీ కాంబోలో వ‌స్తున్న AA22xA6 సినిమాలోనూ న‌టిస్తోంది. ఇవిగాక మ‌రో రెండు తెలుగు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది.

Updated at - Aug 12 , 2025 | 06:56 PM