సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Nagarjuna: నాగార్జున 100 .. పెద్ద సవాలే

ABN, Publish Date - Aug 20 , 2025 | 09:04 PM

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్ అగమ్యగోచరంగా మారుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్ అగమ్యగోచరంగా మారుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అరే అంతలా ఏమైంది.. నాగ్ ఎంచక్కా అందరి హీరోల్లా కాకుండా డిఫరెంట్ గా అలోచించి హీరో అనే సర్కిల్ నుంచి బయటకు వచ్చి సపోర్టింగ్ రోల్స్ లో, విలన్ రోల్స్ లో కనిపిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కదా.. అంటే. నాగ్ హీరోగా కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో చేసినవి మూడు సినిమాలు.. బ్రహ్మాస్త్ర, కుబేర, కూలీ (Coolie). ఈ మూడు సినిమాల్లో నాగార్జున చనిపోతాడు. ముందు రెండు సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ అయినా నాగ్ కాకుండా ఎవరు చేసినా నడిచిపోయేవి.


ఇక చివరిది కూలీ. సైమన్ గా నాగ్ ను తప్ప ఎవరిన ఊహించలేము. అంటే అంత స్టైలిష్ గా లోకేష్ చూపించిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కానీ, ఈ కథను నాగ్ 7 సార్లు విని ఓకే చేసేంత గొప్పది అయితే కాదు. నాగ్ క్యారెక్టర్ లో అంత క్రూరత్వం లేదు.. అంత ఇంపార్టెన్స్ లేదు. దీంతో ఎందుకు నాగ్.. కూలీని ఒప్పుకున్నావ్ అని అభిమానులు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా హీరో సర్కిల్ దాటి వచ్చి ఇలాంటి రోల్స్ చేసినా నాగ్ కు ఒరిగింది ఏమి లేదు. ఆయన కెరీర్ కు ఉపయోగపడిందీ ఏమి లేదు.


నాగ్ ఏమనుకొని ఈ సినిమాలు చేశాడు అనేది పక్కన పెడితే.. తాను ఎలాంటి పాత్రను అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మాత్రం ఇండస్ట్రీకి రుజువు చేశాడు. ఇక ఈ సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ పక్కన పెడితే.. ప్రస్తుతం అందరి చూపు నాగార్జున 100 వ చిత్రంపైనే ఉంది. ప్రతి ఒక్క నటుడి కెరీర్ లో మైల్ స్టోన్ ఫిల్మ్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. 25 వ చిత్రం, 50 వ చిత్రం, 100 వ చిత్రం.. ఇలా ఆ సినిమాలను తమ కెరీర్ లో గుర్తిండిపోయేలా చేసుకోవాలని కలలు కంటూ ఉంటారు.


ప్రస్తుతం నాగ్ తన 100 వ సినిమాను కెరీర్ ను మలుపు తిప్పే సినిమా చేసుకోవడం పక్కన పెడితే రిస్క్ తీసుకుంటున్నాడని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇప్పటికే లోకేష్ కూలీతో దెబ్బ తిన్న నాగ్.. మళ్లీ తమిళ దర్శకుడినే నమ్ముతున్నాడు. పోనీ లోకేష్ లా స్టార్ డైరెక్టరా అంటే కాదు.. అంతకుముందు నాలుగైదు సినిమాలు తీసాడా.. ? అంటే అది లేదు. ఒకే ఒక్క సినిమా తీసిన అనుభవం ఉన్న డైరెక్టర్ కు నాగ్ ఛాన్స్ ఇవ్వడం.. అది కూడా తన 100 వ సినిమా కావడం.. కొద్దిగా కాదు పెద్ద రిస్క్ తో కూడుకున్న నిర్ణయమనినాగ్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.


ఆకాశం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఆర్. కార్తిక్ కు నాగార్జున తన 100 వ సినిమా బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగ్.. తన 100 వ సినిమా కథ కోసం ఎంతోమంది స్టార్, కుర్ర డైరెక్టర్స్ ను కలిసి.. వారందరినీ కాదని కార్తీక్ దగ్గర వచ్చి ఆగాడట. అంతగా ఈ డైరెక్టర్ నాగ్ ను ఎలాంటి కథ చెప్పి ఒప్పించి ఉంటాడు అనేది ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంకోపక్క గత కొన్నేళ్లుగా కింగ్ కు సోలో హిట్ లేదు. నా సామీ రంగా ఒక మోస్తరుగానే ఆడింది. ఏ మార్కెట్ చూసుకొని నాగ్.. ఇప్పుడు సోలో హీరోగా దిగుతాడు. అది కూడా ఈ కొత్త డైరెక్టర్ తో అనేది అందరి అనుమానం. ఇది కనుక బెడిసి కొట్టింది అంటే ట్రోల్స్ ఎక్స్ట్రా బోనస్ గా వస్తాయి. 100 వ సినిమా పోయింది అని విమర్శలు తప్పవు. నాగ్ రేంజ్ ను ఆర్ కార్తీక్ మోయగలడా.. ? అంత బరువు మోసి సినిమాను నిలబెట్టగలడా.. ? అనేది చూడాలి. లేదు అంటే ఈ రిస్క్ ను పక్కన పెట్టి నాగ్ వేరే డైరెక్టర్ ను వెతకాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Salakaar: ఇండో - పాక్ సంబంధాలపై మరో వెబ్ సీరిస్

Prabhas- Anushka: అన్నావదిన మళ్లీ జంటగా కనిపించబోతున్నారోయ్.. పండగే

Updated Date - Aug 20 , 2025 | 09:04 PM