Akhil Marriage: అక్కినేని అఖిల్ పెళ్లి ఫోటోలు,నాగ్ ట్వీట్ వైరల్
ABN, Publish Date - Jun 06 , 2025 | 09:03 PM
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు.
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు అఖిల్ (Akhil) వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు.
''మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం.
మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెల్లివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల నిజం కావడాన్ని మేము చూశాం.
ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి'' అని నాగార్జున ట్వీట్ చేశారు.