సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Nagarjuna: బిగ్ బాస్ స్టేజిపై నాగ్ తో అమల డ్యాన్స్..

ABN, Publish Date - Nov 08 , 2025 | 05:56 PM

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)- అమల (Amala) లవ్ స్టోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Akkineni Nagarjuna

Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)- అమల (Amala) లవ్ స్టోరీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిరాయి దాదా, చినబాబు, ప్రేమ యుద్దం, శివ, నిర్ణయం లాంటి సినిమాళ్లో నటించి మంచి హిట్ పెయిర్ అని అనిపించుకున్నారు. ఇక వారి మధ్య పెరిగిన స్నేహమే.. ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఇక అక్కినేని ఇంటి కోడలిగా అమల తన బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తుంది. నాగ్ తో పెళ్లి తరువాత సినిమాలలో చాలా తక్కువ కనిపించింది. అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో తల్లి పాత్రల్లో నటిస్తూ మెప్పించింది. ఎక్కువగా జంతు సంరక్షణ కార్యక్రమలకే సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది. ఇక చాలాకాలం తరువాత నాగ్ - అమల స్టేజిపై డ్యాన్స్ వేసి అలరించారు. ఈ అరుదైన మూమెంట్ కు వేదికగా మారింది బిగ్ బాస్ సీజన్ 9 స్టేజ్.

అక్కినేని నాగార్జున - అమల జంటగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శివ. 1989 అక్టోబర్ 4 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు టాలీవుడ్ చరిత్రనే తిరగరాసింది. దాదాపు 36 ఏళ్ల తరువాత శివ మరోసారి థియేటర్లో సందడి చేయడానికి రాబోతుంది. అయితే ఈసారి 4k ఫార్మాట్ లో రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఇప్పటికే శివ ట్రైలర్ రిలీజ్ సమయంలో రాజమౌళి దగ్గర నుంచి అల్లు అర్జున్ వరకు ఈ సినిమా గురించి చెప్పిన రివ్యూలతోనే సగం హైప్ వచ్చేసింది. ఈ హైప్ ను నాగ్ మరింత పెంచేశాడు. బిగ్ బాస్ స్టేజిపైకి అమలను తీసుకొచ్చి స్టెప్పులు కూడా వేయించాడు. అప్పట్లో ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు కూడా అదే రీపీట్ అయ్యింది. శివ లుక్ లో నాగ్ ఎంట్రీ అదిరిపోయింది. బొటనీ పాఠముంది సాంగ్ లో అమల కూడా వచ్చి డ్యాన్స్ వేయడం అద్భుతంగా ఉంది. ఇక చివర్లో వర్మ ఎంట్రీ ఇచ్చి.. కంటెస్టెంట్స్ తో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వీరల గా మారింది. నాగ్ - అమల డ్యాన్స్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jaanvi Swarup: సినిమా కంటే ముందు ప్రకటనల్లో మంజుల కూతురు...

Samantha: సమంత- రాజ్ రిలేషన్.. చైతన్య విడాకులు ఇవ్వడానికి కారణం అదే అంటున్న నెటిజన్స్

Updated Date - Nov 08 , 2025 | 05:58 PM