Akkineni Sobhita: అక్కినేని కోడలు.. సమంతను మరిపిస్తుందిగా
ABN, Publish Date - Sep 28 , 2025 | 07:22 PM
ప్రతి అమ్మాయికి పెళ్లి తరువాత లైఫ్ మారుతుంది. పెళ్ళికి ముందున్నట్లు ఆ తరువాత ఉండదు. దానికి సెలబ్రిటీలు సైతం అతీతమేమి కాదు.
Akkineni Sobhita: ప్రతి అమ్మాయికి పెళ్లి తరువాత లైఫ్ మారుతుంది. పెళ్ళికి ముందున్నట్లు ఆ తరువాత ఉండదు. దానికి సెలబ్రిటీలు సైతం అతీతమేమి కాదు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ అంటే అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ(Sobhita Dhulipala) అనే చెప్పొచ్చు. శోభితా.. అక్కినేని నాగ చైతన్య (Akkineni Nagachaitanya)తో ప్రేమాయణం నడపక ముందు వరకు ఆమె ఎవరు అనేది ఎవరికీ తెలియదు. ఎంత తెనాలి అమ్మాయి అయినా కూడా తెలుగువారు అసలు ఆమెను పట్టించుకున్నదే లేదు.
ఇక చై - శోభితా ఎప్పుడైతే కెమెరా కంట పడ్డారో అప్పటి నుంచి అమ్మడి గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక బాలీవుడ్ లో ఈ చిన్నది చేసిన సినిమాలు. ఫోటోషూట్స్ చూసి ఖంగుతిన్నారు. ఏంటి.. ఈమేనా అక్కినేని ఇంటికి కోడలిగా తెస్తున్నారు. అసలు సమంతతో పోలిస్తే.. ఈమెకు ఏం అర్హత ఉంది అని, ఏం బావుంది అని.. అస్సలు సెట్ కాదు అని ఇలా రకరకాలుగా మాట్లాడారు. సమంత ఫ్యాన్స్ అయితే శోభితాను ట్రోల్ చేసినంతగా ఇంకెవ్వరిని ట్రోల్ చేయలేదనే చెప్పొచ్చు.
ఇక చై -శోభితా పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకలో కూడా తెలుగుదనం ఉట్టిపడేలా శోభితా కనిపించింది. అదంతా కేవలం పెళ్లి వరకే అనుకున్నారు. కానీ, పెళ్లి తరువాత శోభితాలో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అచ్చ తెలుగింటి కోడలిగా ఆమె తనను తాను మలుచుకుంటున్న విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. భర్త కోసం వండిపెట్టడం దగ్గర నుంచి ఎయిర్ పోర్ట్ లో ఒకరి కోసం ఒకరు ఎదురుచూడడం వరకు ఆమెలో ఒక గృహిణి కనిపిస్తుంది. ఇక చై తో కానీ, అక్కినేని ఇంటి ఫంక్షన్స్ లో కానీ.. శోభితా డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం అందరినీ ఆమెకు ఫిదా అయ్యేలా చేస్తుంది.
ఎక్కడకు వెళ్లినా చీరకట్టుతో.. నిండుగా కనిపించేలా శోభితా రెడీ అవ్వడం చాలా అద్భుతంగా అనిపిస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఒక షోరూమ్ ఓపెనింగ్ లో ఈ జంట ఎంతో చూడముచ్చటగా కనిపించారు. శోభితా రెడ్ చీర కట్టుకొని ఎంతో చక్కగా మల్లెపూలు పెట్టుకొని కనిపించింది. ఇక నేడు ఈ జంట డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ఎంగేజ్ మెంట్ లో మెరిశారు. విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న కార్తీక్ ప్రస్తుతం చైతో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక కార్తీక్ నిశ్చితార్థం హర్షితతో చాలా గ్రాండ్ గా జరిగింది.
కార్తీక్ ఎంగేజ్ మెంట్ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అంటే అక్కినేని కోడలు అనే చెప్పాలి. లైట్ గ్రీన్ కలర్ చీరలో శోభితా.. ఆలివ్ గ్రీన్ కలర్ కుర్తాలో చై.. ఎంతో ముద్దుగా కనిపించారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు.. శోభితాపై ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. అక్కినేని గౌరవాన్ని కాపాడుతుందని, సమంతను సైతం మరిపిస్తుందని.. ఇప్పుడు సామ్ పేరు ఎవరూ తీసుకురావడం లేదని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా అక్కినేని కోడలిగా శోభితా పర్ఫెక్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. మరి శోభితా ఈ గౌరవాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందో చూడాలి.
Kayadu Lohar: విజయ్.. నీవి స్వార్ధపూరిత రాజకీయాలు.. కయాదు ఏం చెప్పిందంటే
Kantara Chapter 1: తెలీదు శివుడా భక్తి మార్గం.. వరాహరూపం సాంగ్ ను మించి ఉందిగా