Akkineni Amala: అభిమానులు కాదు రౌడీలు.. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి
ABN, Publish Date - Jul 02 , 2025 | 03:04 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఇంటికి అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు చొరబడి హంగామా చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Akkineni Amala: అభిమాని లేనిదే హీరోలు లేరు. ఇది అందరికీ తెల్సిన విషయమే. అయితే ఆ అభిమానం ఎక్కడివరకు ఉండాలి అనేది తెలిసి ఉండాలి. కొంతమంది మితిమీరిన అభిమానం.. సెలబ్రిటీలకు ప్రాణ సంకటంగా మారుతుంది. నిన్నటికి నిన్న హీరో రామ్ (Ram Pothineni) బస చేస్తున్న హోటల్ రూమ్ కి వెళ్లి ఇద్దరు తాగిన వ్యక్తులు రామ్ ను భయపెట్టిన విషయం ఇంకా మర్చిపోకముందే.. తాజాగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna)ఇంటికి అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు చొరబడి హంగామా చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అక్కినేని అభిమానులం అని చెప్పుకుంటూ అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు నాగార్జున ఇంట్లో చొరబడినట్లు సమాచారం. వెంటనే వారిని గుర్తించిన అమల.. బయటకు తీసుకొచ్చి మాట్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో అమల వారిపై సీరియస్ అయ్యింది. నాగార్జున సర్ ను స్టూడియోలో కూడా కలవలేదు. ఇక్కడ ఉన్నారు.. ఇక్కడ ఉన్నారు అంటూ చెప్తూనే వస్తున్నారు. అందుకే ఇక్కడకు వచ్చామని ఒక వ్యక్తి అనగా అమల.. అయితే మీరు ఫ్యాన్స్ కాదు. సినిమాలు ఫ్యాన్స్ కోసమే తీస్తున్నారు. ఆ తరువాత వారు నెత్తిమీద కూర్చుంటే ఎలా.. ?
మీరు ఫ్యాన్స్ కాదు.. క్రిమినల్స్ , రౌడీలు. ఫ్యాన్స్ ఇలా చేయరు. దీన్ని వేధించడం అంటారు. లీగల్ గా కేసు కూడా వేయొచ్చు. ఫ్యాన్స్ అనే మాటను మీరు మిస్ యూజ్ చేస్తున్నారు. ఇది తప్పు.. మీ ఇంట్లోకి వచ్చి ఇలా చేస్తే మీకు ఎలా ఉంటుంది.మర్యాదగా వెళ్లిపోండి. ఫ్యాన్స్ అని వేషాలు వేయొద్దు. మీరు ఫ్యాన్స్ కాదు రౌడీలు అంటూ మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో ఎప్పటిది అనే విషయం తెలియరాలేదు.
ఇక ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. తాము ఇలా చేయమని, నిజంగానే వారు రౌడీలలానే కనిపిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఇక నెటిజన్స్ శాతం అమలకు సపోర్ట్ చేస్తున్నారు. అలా అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఫ్యాన్స్ అని చెప్పడం ఏంటి.. ? వారు ఎంత భయపడి ఉంటారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇంట్లో నాగార్జున లేడని తెలుస్తోంది. లేకపోతే ఆయనే వచ్చేవాడిని అంటున్నారు.ఇకపోతే నాగార్జున సినిమాల విషయానికొస్తే కుబేరతో మంచి హిట్ అందుకున్న కింగ్.. తాజాగా కూలీలో మరోసారి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Komalee Prasad: వాటిని నమ్మకండి.. నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు