సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Akhil: హిట్ కోసం అయ్యగారి కష్టాలు..

ABN, Publish Date - Sep 10 , 2025 | 10:12 PM

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) చాలాకాలంగా ఇండస్ట్రీలో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా ఇప్పటికీ స్ట్రగులింగ్ హీరోల లిస్ట్ లోనే ఉన్నాడు

Lenin

Akkineni Akhil: అక్కినేని అఖిల్ (Akkineni Akhil) చాలాకాలంగా ఇండస్ట్రీలో హిట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయినా ఇప్పటికీ స్ట్రగులింగ్ హీరోల లిస్ట్ లోనే ఉన్నాడు. లెనిన్ (Lenin) సినిమా తన జాతకాన్ని మార్చేస్తుందని అఖిల్ గట్టిగా నమ్ముతున్నాడు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన మొదట శ్రీలీలను ఎంపిక చేశారు. ఫస్ట్ గ్లింప్స్ లో కూడా ఆమెనే కనిపించింది. ఆ తరువాత కొన్ని కారణాల వలన శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకుంది.


శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను తీసుకున్నారని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మధ్యలో అఖిల్ పెళ్లి అడ్డుకట్ట వేసింది. ఇక ఈ మధ్యనే మళ్లీ లెనిన్ పట్టాలెక్కింది. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. గతంలో ఏజెంట్ సినిమాకు బాడీని పెంచడానికి అఖిల్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెల్సిందే. అయినా ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు లెనిన్ కోసం అయ్యగారు.. కొత్తగా యాస నేర్చుకుంటున్నాడట. ఇప్పటిక మాస్ లుక్ లో దర్శనమిచ్చిన అఖిల్.. ఈ కొత్త ప్రయోగం కూడా చేయనున్నాడట.


తండేల్ లో నాగ చైతన్య ఎలా అయితే యాసలో మాట్లాడి అలరించాడో.. ఇప్పుడు అఖిల్ కూడా అదే విధంగా చేయబోతున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ అక్క పాత్ర చాలా కీలకమని, ఆమె కోసం ఒక సీనియర్ నటిని వెతుకుతున్నారని, క్లైమాక్స్ లో వీరిద్దరి సీన్స్ ప్రేక్షకులను కదలనివ్వకుండా కూర్చోబెడతాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా అఖిల్ హిట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో కొన్ని వర్కవుట్ అయినా అయ్య్యగారు హిట్ కొట్టినట్టే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి లెనిన్.. వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

The Rajasaab: రాజాసాబ్ ఫస్ట్ సింగిల్.. హైప్ పెంచేసిన SKN

Karishma Kapoor: రూ. 1900 కోట్లు తీసుకున్నారు.. ఇంకా సరిపోలేదా

Updated Date - Sep 10 , 2025 | 10:12 PM