సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda 2: అఖండ తాండవం కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే

ABN, Publish Date - Dec 06 , 2025 | 07:06 PM

అన్ని బావుండి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ అంతా బాలయ్య.. అఖండ తాండవం (Akhanda Thandavam).. సౌండ్ బాక్సులు పగిలిపోయాయి.

Akhanda 2

Akhanda 2: అన్ని బావుండి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ అంతా బాలయ్య.. అఖండ తాండవం (Akhanda Thandavam).. సౌండ్ బాక్సులు పగిలిపోయాయి. జై బాలయ్య అనే నినాదాలతో మోత మ్రోగిపోతూ ఉండేది. కానీ, ఇప్పుడు అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ? ఎన్నిరోజులు వస్తుంది.. ? అసలు రిలీజ్ అవుతుందా.. ? లేదా.. ? అనే సందిగ్దతతో ఫ్యాన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. నిర్మాతల ఆర్థిక సమస్య.. అఖండ 2 ని ఈరోజు రిలీజ్ కాకుండా చేసింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వచ్చిన నాలుగో సినిమా కావడం, థమన్ మ్యూజిక్ అందివ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అసలు సెప్టెంబర్ 25 న రిలీజ్ కావాల్సిన అఖండ 2.. అనుకోని విధంగా డిసెంబర్ 5 కి వాయిదా పడింది. ఇక ఇప్పుడు రిలీజ్ టైమ్ ఈ సమస్య వచ్చి పడింది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అనేదానిపైనే ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అఖండ 2 నిర్మాతలు అయిన రామ్ ఆచంట, గోపీ ఆచంటతో పాటు దిల్ రాజు, శిరీష్.. నందమూరి బాలకృష్ణతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్ లో అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ గురించి చర్చించనున్నారు.

డిసెంబర్ 5 వాయిదా పడడంతో అందరూ రెండు డేట్స్ ఫిక్స్ అయ్యినట్లు టాక్నడుస్తోంది. అయితే డిసెంబర్ 12 కానీ, లేకపోతే డిసెంబర్ 25 కానీ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కానీ, డిసెంబరు 25 న సినిమా విడుదలపై ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ మినిట్ లో రిలీజ్ వాయిదా వేయటం వల్ల తాము లాస్‌ అయ్యామంటూ. ఆ లాస్ ను నిర్మాతలు భరించాలంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా డిసెంబర్ 24 నైట్ ప్రీమియర్స్ కు ఓవర్సీస్ లో ధియేటర్స్ దొరకటం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అఖండ 2 ఆ డేట్ ను రాదు అని చెప్పొచ్చు.

ఇక మిగిలింది డిసెంబర్ 12.. అందుతున్న సమాచారం ప్రకారం ఇదే డేట్ ని మేకర్స్ ఫైనల్ చేయనున్నారని అంటున్నారు. ఇక థియేటర్స్ వద్ద ఇప్పటికే కట్టిన బ్యానర్లను కానీ, కటౌట్స్ ని కానీ తీయవద్దని టీమ్ సూచించినట్లు తెలుస్తోంది. మరి ఈ మీటింగ్ లో బాలయ్య ఏమంటాడు.. ? అనేదాని బట్టి నిర్ణయం ఉంటుందని అంటున్నారు. మరి డిసెంబర్ 12 న అఖండ 2 ఉంటుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.

Updated Date - Dec 06 , 2025 | 07:09 PM