Nandamuri Balakrishna: నందమూరి తమన్‌ను.. బాలీవుడ్‌కు పరిచయం చేసిన బాలయ్య
ABN, Publish Date - Nov 15 , 2025 | 06:03 AM
శుక్రవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో తమన్‌ను నందమూరి తమన్‌ను అంటూ నందమూరి బాలకృష్ణ బాలీవుడ్‌కు పరిచయం చేశారు.
'సనాతన హిందూ దర్మం శక్తి, పరాక్రమం అఖండ 2 (Akhanda 2) చిత్రంలో చూస్తారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకి ఈ సినిమా చూపించాలి' అని నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఆయన కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకె క్కుతోన్న చిత్రం 'అఖండ 2. తాండవం. ఎం. తేజస్విని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
శుక్రవారం ముంబైలో జరిగిన ఈవెంట్ ఫస్ట్ సింగిల్ 'ది తాండవం' పూర్తి పాటను మేకర్స్ విడుదల చేశారు. కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. ఖైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్ ఆలపించగా, తమన్ స్వరపరిచారు. పాట వింటున్నంత సేపు గూస్ బంప్స్ రావడం పక్కా అనేలా ఉంది.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ 'బోయపాటి గారితో మూడు సినిమాలు చేశా. అవన్నీ సూపర్ హిట్ ఈ సినిమా కూడా అంతకు మించి ప్రేక్షకులను అలరిస్తుంది' అని చెప్పారు. అయితే.. పాట విడుదల సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సంగీత దర్శకుడు తమన్ (Thaman)ను ఆకాశానికెత్తేశారు. వరుసబెట్టి నాలుగు హిట్లు ఇచ్చాడని అతను ఉత్త తమన్ కాదని నందమూరి తమన్ అంటూ బాలీవుడ్ మీడియా ముందు పరిచయం చేసి అక్కడి వారిని ఒకింత షాక్‌కు గురి చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే.. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు.