Nandamuri Balakrishna: 'అఖండ -2' నుండి అదిరిపోయే డాన్స్ నంబర్... ఎప్పుడంటే...
ABN, Publish Date - Nov 17 , 2025 | 11:53 AM
'అఖండ తాండవం -2' సినిమా నుండి సెకండ్ సింగిల్ మంగళవారం సాయంత్రం విడుదల కాబోతోంది. వైజాగ్ జగదాంబ థియేటర్ లో అభిమానుల సమక్షంలో దీనిని రిలీజ్ చేస్తారు.
నందమూరి నట సింహ బాలకృష్ణ (Balakrishna) 'అఖండ తాండవం -2' (Akhanda Thandavam -2) మూవీ ప్రమోషన్స్ పీక్స్ కు చేరుకుంటున్నాయి. డిసెంబర్ 5న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో వరుసగా ప్రచార కార్యక్రమాలను జరుపుతున్నారు మేకర్స్. ముంబై ఈవెంట్ కాగానే హైదరాబాద్ లో మీడియా మీట్ పెట్టిన 'అఖండ -2' దర్శక నిర్మాతలు ఇప్పుడు సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. 'జాజి కాయ.. జాజి కాయ' అంటూ ఈ సాగే ఈ డాన్స్ నంబర్ ను వైజాగ్ జగదాంబ థియేటర్ లో నవంబర్ 18న విడుదల చేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం 5.00 గంటలకు అభిమానుల సమక్షంలో ఈ పాట విడుదల కాబోతోంది. ఇందులో బాలయ్య బాబుతో కలిసి మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త (Samyuktha) అరుదైన స్టెప్స్ తో అదరగొట్టబోతోంది.
తమన్ స్వరాలు సమకూర్చిన 'జాజికాయ... జాజికాయ' పాటను కాసర్ల శ్యామ్ రాశారు. నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న 'అఖండ - తాండవం -2'ను రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో వచ్చిన 'సింహా, లెజెంట్, అఖండ' చిత్రాలు వరుసగా హ్యాట్రిక్ సాధించడంతో సహజంగానే 'అఖండ తాండవం -2'పై భారీ అంచనాలు నిలకొన్నాయి.
Also Read: Dhandoraa: శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి.. 'దండోరా' టీజర్ అదిరింది
Also Read: Tuesday TV Movies: మంగళవారం, Nov 18.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు