సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhanda - 2 3D: ప్రేక్షకులకు కొత్త అనుభూతి కోసమే..

ABN, Publish Date - Nov 16 , 2025 | 01:35 PM

అఖండ-2 తాండవం టీమ్‌ థియేటర్లు దద్దరిల్లే మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బాలయ్య ఫ్యాన్‌కు పూనకాలు తెప్పించే వార్తే అవుతుంది ఇది.

అఖండ-2 తాండవం (Akhanda 2 Tandavam) టీమ్‌ థియేటర్లు దద్దరిల్లే మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. బాలయ్య ఫ్యాన్‌కు పూనకాలు తెప్పించే వార్తే అవుతుంది ఇది. నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (boyapati Sreenu) కాంబోలో వస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ డివోషనల్‌ హై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘అఖండ 2 తాండవం.’ ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన చ్రార చిత్రాలు ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ హైప్‌ను మరింత పెంచేలా  కొత్త ప్రకటన చేశారు మేకర్స్‌. (Akhanda 2 Tandavam 3D)

ఈ చిత్రాన్ని త్రీడీ ఫార్మెట్‌లో విడుదల చేయనున్నట్లు 14 రీల్స్‌ ప్లస్‌ నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమాకు హైప్‌ పదింతలు పెరిగినట్టే. ఇటీవల విడుదల చేసిన సాంగ్‌లో హిమాలయాల నుంచి ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్ర్చాను సాంగ్‌లో చూపించారు. వీటిన్నింటినీ త్రీడీ ఫార్మెట్‌లో చూస్తే చూస్తే అద్భుతంగా ఉంటాయంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు విభినంనపాత్రల్లో కనిపిస్తారు. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా, రెండోది మురళీ కృష్ణ పాత్ర. ఈ కథ, పాటలకు తగ్గట్టే తమన్‌ ఇచ్చిన సంగీతం బీజీఎం గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది. తాజాగా మొదటి పాట తాండవం’ లిరికల్‌ వీడియో రోమాలు నిక్కబోడిచేలా చేస్తోంది. అందులో బాలయ్య రుద్ర తాండవం చూపించారు. ఈ పాటకు కల్యాణ్‌ చక్రవర్తి సాహిత్యం అందించగా.. శంకర్‌ మహాదేవన్‌, కేౖలాష్‌ ఖేర్‌, దీపక్‌ బ్లూ ఆలపించారు.   


బోయపాటి శ్రీను మాట్లాడుతూ  ‘బాలకృష్ణ అభిమానులు, ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్  ఇవ్వాలన్న ఉద్దేశంతోనే  3డీ ఫార్మాట్‌లో  తీసుకొస్తున్నాం. భారతదేశ ఆత్మ, పరమాత్మ ఈ సినిమా. మన దేశ ధర్మం, ధైర్యం. ప్రపంచ దేశాల్లో మతం కనిపిస్తుంది ఈ సినిమాలో. కానీ, ఈ దేశంలో మాత్రమే సనాతన ధర్మం కనిపిస్తుంది. దాని ఆధారంగా రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నా. అందుకే కొన్ని రోజుల క్రితం ప్రచారాన్ని ముంబయి నుంచి ప్రారంభించాం’’ అని తెలిపారు.

Updated Date - Nov 16 , 2025 | 02:05 PM