Akhanda 2: బాలయ్య ఊర మాస్ బ్యాటింగ్.. అఖండ 2 నెవర్ బిఫోర్ బిజినెస్
ABN , Publish Date - Nov 27 , 2025 | 06:53 PM
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న అఖండ -2 తాండవం సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్టుగానే భారీ స్థాయిలో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది.
నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో వస్తోన్న నాలుగో చిత్రం 'అఖండ-2- తాండవం' (Akhanda -2 Thandavam). ఇప్పటి దాకా వీరిద్దరి కాంబోలో వచ్చిన "సింహా (Simha), లెజెండ్, అఖండ" చిత్రాలు ఘనవిజయం సాధించాయి.. దాంతో బాలయ్య-బోయపాటి శ్రీను కలయికలో 'హ్యాట్రిక్' నమోదయింది. ఈ నేపథ్యంలో వస్తోన్న 'అఖండ-2- తాండవం'పై సర్వత్రా భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ కెరీర్ లో వస్తోన్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా 'అఖండ-2' నిలవనుంది. అందువల్ల సౌత్ లోనే కాదు నార్త్ లోనూ 'అఖండ-2- తాండవం'పై ఓ స్పెషల్ బజ్ క్రియేట్ అయింది.
ఇంతకు ముందో లెక్క- ఇప్పుడో లెక్క అన్నట్టుగా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యంత భారీ చిత్రంగా 'అఖండ-2- తాండవం' రూపొందింది. 2021లో వచ్చిన 'అఖండ' తరువాత నుంచీ వరుసగా "వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్" తోనూ బంపర్ హిట్స్ చూశారు బాలయ్య. అందువల్ల రాబోయే 'అఖండ-2- తాండవం'పై అంచనాలు భారీగా ఉన్నాయి. యంగ్ హీరోస్ కు సైతం సవాల్ విసరుతూ బాలయ్య వరుస విజయాలతో సాగిపోతున్నారు. దాంతో ఆయన ఫ్యాన్స్ 'జై బాలయ్యా.' అంటూ ఊరూవాడా ఏకం చేస్తూ 'అఖండ-2- తాండవం' చూడటానికి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం ఫ్యాన్స్ కు ఆనందం పంచుతోంది.
ఇప్పటి దాకా బాలకృష్ణ కెరీర్ లోనే జరగనంత బిజినెస్ 'అఖండ-2- తాండవం'కు జరిగిందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. 'అఖండ-2' సినిమాకు దాదాపు 150 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని అలాగే ఈ సినిమా ఓటీటీ రైట్స్ రూ.85 కోట్లు పలికాయనీ విశేషంగా వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పణలో ఈ మూవీ రూపొందింది. దాంతో 'అఖండ-2' చిత్రానికి మరింత క్రేజ్ నెలకొందని చెప్పవచ్చు. తన తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో బాలకృష్ణ సైతం అత్యంత ఉత్సాహంగా 'అఖండ-2' ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. భారతీయ సినిమాకు కేంద్రమైన ముంబైలో ముందుగా 'అఖండ-2' ప్రచారం మొదలయింది.
అక్కడ 'అఖండ-2' టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్టణం- జగదాంబ థియేటర్ లో 'జాజికాయ...' అంటూ సాగే పాటను జనం ముందు నిలిపారు. ఈ రెండు పాటలు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. ముంబై, వైజాగ్ తరువాత కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో 'అఖండ-2' మూవీ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ వేడుకలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆ తరువాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలసి 'అఖండ-2' టీమ్ ఆయనకు స్పెషల్ గా డిజైన్ చేసిన త్రిశూలం ను బహూకరించడం విశేషంగా మారింది.దాంతో నార్త్, సౌత్ రెండు చోట్ల 'అఖండ-2'పై స్పెషల్ క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేశారు.
గతంలో బాలకృష్ణ హీరోగా వరుసగా నాలుగు సినిమాలతో ఘనవిజయం సాధించిన దర్శకులు ఇద్దరు - ఒకరు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) - రెండోవారు బి. గోపాల్ (B. Gopal). బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ రూపొందించిన 'మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య' చిత్రాలు అన్నీ 300 రోజులకు పైగా ప్రదర్శితమయ్యాయి.
ఇక బి.గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య నటించిన 'లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు' చిత్రాలు ఒకదానిని మించి మరోటి ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు బాలయ్యతో బోయపాటి శ్రీను రూపొందించిన నాలుగో సినిమాగా వస్తోన్న 'అఖండ-2-తాండవం' కూడా ఘనవిజయం సాధిస్తే - కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి శ్రీను కూడా చేరతారు.
బాలయ్యతో ఇప్పటికే బోయపాటి శ్రీను రూపొందించిన 'సింహా, లెజెండ్, అఖండ' చిత్రాలు మూడూ - డైరెక్ట్ సిల్వర్ జూబ్లీస్ జరుపుకున్నాయి. వీటిలో 'లెజెండ్' సినిమా 2 కేంద్రాలలో డైమండ్ జూబ్లీ జరుపుకొని అరుదైన చరిత్ర సృష్టించింది. ఇక ఇదే 'లెజెండ్' సినిమా వెయ్యి రోజులకు పైగా ఆడి సౌత్ లోనే థౌజండ్ డేస్ చూసిన ఏకైక చిత్రంగా నిలచింది. ఇంతటి విజయాన్ని బాలయ్యతో షేర్ చేసుకున్న బోయపాటి శ్రీను ఈ 'అఖండ-2-తాండవం'తో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
Also Read: Peddi: 'చికిరి' పాట కోసం.. ఇంత చేశారా! తెర వెనుక దృశ్యాలు
Also Read: Ramayana: ‘రామాయణ’ ప్రపంచానికే ప్రామాణికంగా ఉంటుంది