Akhanda 2 Thaandavam: గూస్ బంప్స్ తెప్పిస్తున్న అఖండ తాండవం సాంగ్
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:39 PM
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ కాంబోకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ కాంబో అనే చెప్పొచ్చు
Akhanda 2 Thaandavam: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) - బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్ కాంబోకి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఈ కాంబో అనే చెప్పొచ్చు. సింహా, లెజెండ్, అఖండ.. ఇప్పుడు అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అఖండతో రికార్డులు బద్దలు కొట్టిన ఈకాంబో అఖండ 2 తో మరోమారు రికార్డులు బద్దలు కొట్టడానికి డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక బాలయ్య సినిమా అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ కాస్తా నందమూరి థమన్ గా మారిపోతాడు. తాజాగా ఈ అఖండ తాండవం నుంచి టైటిల్ ట్రాక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అఖండ లో టైటిల్ ట్రాక్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.. ఇందులో అంతకుమించి ఉందని చెప్పొచ్చు. అఖండా తాండవం అంటూ సాగిన ఈ సాంగ్ లిరిక్స్ మొత్తం శివుని గురించే ఉంది. ఆ లిరిక్స్ కూడా కళ్యాణ్ చక్రవర్తి రైమింగ్ లో అద్భుతంగా రాశారు. ఇక ఈ సాంగ్ మొత్తాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది మాత్రం సింగర్స్ కైలాష్ ఖేర్, శంకర్ మహదేవన్, దీపక్ వాయిస్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
రైమింగ్ లో ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక నందమూరి బాలకృష్ణ అఘోరా గెటప్ లో విశ్వరూపం చూపించాడు. సాంగ్ లో మధ్య మధ్యలో శివ తాండవం చేస్తూ కనిపించాడు. థమన్ మ్యూజిక్ గురించి చెప్పనవసరం లేదు. బాలయ్యకు అంటే ఎలా ఇస్తాడో అందరికీ తెల్సిందే. మొదటి సాంగ్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశాడు బోయపాటి. ఈ సాంగ్ లో బోయపాటి మార్క్ ఎక్కడా తగ్గలేదు.. జూమ్ షాట్స్, హీరో దగ్గరకు రాగానే విలన్స్ హెయిర్ ఎగరడం... ఇలా ప్రతీది బోయా మార్క్ ను గుర్తుచేస్తుంది. ఈ టైటిల్ ట్రాక్ సోషల్ మీడియా చార్ట్ బస్టర్ అవ్వడం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య- బోయపాటి మరో హిట్ ను తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.