సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nandamuri Balakrishna: అఖండ -2 టిక్కెట్ హైక్ ఉందా... లేదా...

ABN, Publish Date - Nov 22 , 2025 | 03:19 PM

నటసింహ బాలకృష్ణ 'అఖండ-2- తాండవం' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఓ రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. మరి ఈ భారీ చిత్రానికి తెలంగాణలో టిక్కెట్ రేట్స్ హైక్ ఉంటుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Akhanda 2 Thandavam Movie

బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబోలో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ-2- తాండవం' (Akhanda 2 Thandavam). గతంలో వీరి కలయికలో వచ్చిన మూడు చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కొన్ని రికార్డ్స్ సృష్టించాయి. డిసెంబర్ 5న రాబోయే 'అఖండ-2' కూడా ఘనవిజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారి అంచనాలను పెంచుతూ శుక్రవారం రిలీజైన 'అఖండ-2' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో 'అఖండ-2'ను భారీ స్థాయిలో రిలీజ్ చేసే ప్రణాళిక రూపొందించారు మేకర్స్. ఈ సినిమాను నైజామ్ లో దిల్ రాజు (Dil Raju) రిలీజ్ చేస్తున్నారు. అందువల్ల తెలంగాణలో ఈ మూవీకి టిక్కెట్ రేట్స్ హైక్ ఉంటుందా? ఉంటే ఎంత పెంచుతారు? అన్న దానిపై చర్చ సాగుతోంది. తెలంగాణలో దిల్ రాజు ఎఫ్.డి.సి. చైర్మన్ కాబట్టి ఈ తరహా ఆలోచనల్లో సినీజనం ఉన్నట్టు తెలుస్తోంది.


కొంతకాలం కిందట తెలంగాణ ప్రభుత్వం ఇకపై స్టేట్ లో సినిమా టిక్కెట్ రేట్స్ పెంపు ఉండదని ప్రకటించింది. ఈ మధ్య సినీకార్మికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని సన్మానించారు. ఆ సమయంలో తమ వద్దకు ఏ నిర్మాతైనా టిక్కెట్ రేట్స్ పెంపుకోసం వస్తే - లాభాల్లో సినీ వర్కర్స్ కు కూడా షేర్ ఇవ్వాలని ఆదేశిస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్న 'అఖండ-2'కు టిక్కెట్ రేట్స్ హైక్ ఉంటుందా లేదా అన్న చర్చ సాగుతోంది. నిజానికి తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ రేట్స్ పెంపుదల ఉండదని చెప్పిన తరువాత పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) 'ఓజీ' (OG) కానీ, 'కాంతారా చాప్టర్ 1' (Kanthara 1) కానీ టిక్కెట్ రేట్స్ పెంచమని కోరలేదు. అయినా ఈ చిత్రాలు తెలంగాణలో మంచి వసూళ్ళు చూశాయి. ఈ నేపథ్యంలో 'అఖండ-2' నిర్మాతలు కూడా నైజామ్ లో టిక్కెట్ రేట్స్ హైక్ చేయమని అడగబోరని తెలుస్తోంది. కానీ, ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు కారణంగా ఏమైనా పెరుగుతాయేమో అని కొందరు ఊహిస్తున్నారు.


నిజానికి టిక్కెట్ రేట్స్ పెంపుదల వల్లే కొన్ని చిత్రాలకు ఆరంభంలో వసూళ్ళు తగ్గుతున్నాయి. అందువల్ల 'అఖండ-2' విషయంలో మరీ భారీ రేట్లు ఉండవని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అఖండ-2' టిక్కెట్ రేట్లు పెంచుకొనే వీలు కల్పించినా, భారీగా పెంచరనే వినిపిస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిసెంబర 4 రాత్రిన 'అఖండ-2' పెయిడ్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి. ఆ ప్రీమియర్ షోస్ కు భారీ టిక్కెట్స్ పెట్టుకున్నా, అవి ఫ్యాన్స్ కు సంబంధించిన షోస్ కాబట్టి వాటిలో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదు. కావున ఆంధ్రప్రదేశ్ లో మునుపెన్నడూ లేనివిధంగా 'అఖండ-2' ప్రీమియర్ షోస్ సాగనున్నాయి. నైజామ్ లోనూ డిసెంబర్ 4వ తేదీ రాత్రి పలు థియేటర్లలో ప్రీమియర్ షోస్ ప్లాన్ చేసినట్టు సమాచారం. 'అఖండ-2'కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఫస్ట్ డే ఎంత వసూలు చేస్తుందో చూడాలన్న ఆసక్తి సినీఫ్యాన్స్ లో కలుగుతోంది. బాలయ్య కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా వస్తోన్న 'అఖండ-2' ఎంత ఓపెనింగ్ పోగేస్తుందో చూడాలి.

Also Read: Bhatti Vikramarka: ఏయన్నాఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారు..

Also Read: Top Actress: అపోహలు తొలగిపోయాయంటున్న సమంత

Updated Date - Nov 22 , 2025 | 03:19 PM