Ajay Bhupati 4: ఘట్టమనేని మూడోతరం హీరో.. ఎంట్రీ షురూ
ABN, Publish Date - Nov 09 , 2025 | 12:49 PM
మహేశ్‌బాబు సోదరుడు, దివంగత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొంతకాలంగా వార్తలు, ఫొటో షూట్‌లు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది.
మహేశ్‌బాబు (Mahesh Babu) సోదరుడు, దివంగత రమేశ్‌బాబు తనయుడు జయకృష్ణ హీరోగా (Jaya Krishna Ghattamaneni)ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొంతకాలంగా వార్తలు, ఫొటో షూట్‌లు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు దానిపై క్లారిటీ వచ్చింది. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపత (Ajay bhupati). జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. నా తదుపరి చిత్రంతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా, గర్వంగా ఉంది. గొప్ప కథ, అంతకుమించిన బాధ్యతో ఈ సినిమా వస్తుంది. కొండల హృదయం నుంచి రా, ఇంటెన్స్, రియలిస్టిక్ లవ్‌స్టోరీతో ఈ సినిమా రాబోతుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం’ అని అన్నారు.
ఆయన షేర్ చేసిన పోస్టర్ చూస్తే తిరుమల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించనున్నట్టు అర్థమవుతోంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సూపర్‌స్టార్ కృష్ణతో ‘అగ్ని పర్వతం’ చిత్రాన్ని తీసిన అశ్వినీదత్ మహేశ్‌బాబు తొలి సినిమా ‘రాజకుమారుడు’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఘట్టమనేని మూడోతరాన్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది వైజయంతీ సంస్థ. ఈ విషయాన్ని చెబుతూ పద్మాలయా స్టూడియోస్ కూడా ఓ లేఖ విడుదల చేసింది. పద్మాలయా స్టూడియోస్, వైజయంతి మూవీస్ సంస్థ బంధం తరతరాల వెండితెర అనుబంధం అని పేర్కొన్నారు.