Gaddar Awards: అవార్డుల్లో ఆహా ఓటీటీ మూవీస్ హవా
ABN , Publish Date - May 29 , 2025 | 05:48 PM
మే 29న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 విజేతలను ప్రకటించారు. అవార్డులు పొందిన పలు చిత్రాలను తామే స్ట్రీమింగ్ చేస్తున్నామని ఆహా ఓటీటీ సంస్థ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమకు అందిస్తున్న ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డ్స్ లో ఆహా ఓటీటీ మూవీస్ సత్తా చాటాయి. పలు మేజర్ కేటగిరీల్లో ఆహా మూవీస్ అవార్డ్స్ గెల్చుకోవడం విశేషం. సెకండ్ బెస్ట్ ఫిలింగా 'పొట్టేల్', బెస్ట్ చిల్డ్రన్ ఫిలింగా '35 ఇది చిన్న కథ కాదు' అవార్డ్స్ దక్కించుకున్నాయి. '35 ఇది చిన్న కథ కాదు' మూవీలో నటనకు నివేదా థామస్ కు బెస్ట్ హీరోయిన్ గా, 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' చిత్రంలో నటనకు ఉత్తమ సహాయ నటిగా శరణ్య ప్రదీప్, 'రజాకార్' మూవీకి మంచి సంగీతాన్ని అందించిన భీమ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్స్ గెల్చుకున్నారు.
'35 ఇది చిన్న కథ కాదు'లో నటించిన మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల, 'మెర్సీ కిల్లింగ్'లో నటించిన బేబి హారిక ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టులుగా గద్దర్ అవార్డ్స్ కు ఎంపికయ్యారు. 'రాజు యాదవ్' సినిమాకు బెస్ట్ లిరిసిస్ట్ గా చంద్రబోస్, 'రజాకార్' మూవీకి బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గద్దర్ అవార్డ్స్ దక్కించుకున్నారు. 'పొట్టేల్' మూవీలో నటనకు అనన్య నాగళ్ల, 'రాజు యాదవ్' మూవీకి నిర్మాతలుగా ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ గెల్చుకున్నారు.
తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలకు ప్రధాన విభాగాల్లో గద్దర్ అవార్డ్స్ దక్కడంపై ఆహా టీమ్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఆహా ప్రేక్షకుల అభిరుచికి తగ్గ చిత్రాలు, సిరీస్ లను, షోలను అందించడంతో పాటు, ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లోని సాంస్కృతిక వైభవాన్ని చాటే కంటెంట్ ని అందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆహా టీమ్ తెలిపింది. అవార్డ్ విన్నింగ్ మూవీస్ ను థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఆహా ఓటీటీలో చూసేయొచ్చు.
Also Read: Tollywood: థియేటర్లలో సందడి చేసేవి ఇవే...
Also Read: Bayya Sunny Yadav: NIA అదుపులో.. యూట్యూబర్ సన్నీ యాదవ్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి