VenkateshXTrivikram: 20నెలల తర్వాత.. మెగాఫోన్ పట్టిన తివిక్రమ్
ABN, Publish Date - Oct 09 , 2025 | 06:56 AM
వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా త్రివిక్రమ్ తెర కెక్కించనున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది.
వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా త్రివిక్రమ్ తెర కెక్కించనున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. వెంకీ 77 అనేది వర్కింగ్ టైటిల్. ఈ సందర్భంగా షూటింగ్‌లో వెంకటేశ్ (Venkatesh), త్రివిక్రమ్ (Trivikram) కలిసి దిగిన ఫొటోను నిర్మాత నాగవంశీ (Naga Vamsi) అభిమానులతో పంచుకున్నారు.
'20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మాటల మాంత్రికుడు మళ్లీ మెగాఫోన్ పట్టారు. అందరికీ అభిమాన కథానాయకుడైన వెంకటేశ్‌తో చేతులు కలిపారు. ఓజీస్ ఎంటర్టైన్ మెంట్స్ మళ్లీ పునరావృతం అవుతుంది' అని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ (S Radha Krishna) నిర్మిస్తున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికలు నటించే అవకాశం ఉందని, త్రిష, రుక్మిణీ వసంత్, నిధి అగర్వాల్, శ్రీనిధి శెట్టి పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం.