సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Adivi Sesh: గూఢచారి రాక ఖరారు

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:33 AM

బ్లాక్‌ బస్టర్‌ స్పై థ్రిల్లర్‌ గూఢచారికి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం జీ2 అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న

బ్లాక్‌ బస్టర్‌ స్పై థ్రిల్లర్‌ ‘గూఢచారి’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘జీ2’. అడివి శేష్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని 2026 మే 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. సినిమాలో ఈసారి ఏజెంట్‌ 116గా వామికా గబ్బి ఎంట్రీ ఇస్తున్నారు. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ ఉన్న క్యారెక్టర్‌ ఇది. ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మురళీ శర్మ, సుప్రియా యార్లగడ్డ, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 150 రోజులపాటు, ఆరు దేశాల్లో, 23 భారీ సెట్లతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 02:33 AM