సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Adivi Sesh: సైలెంట్‌గా వచ్చి హిట్ కొట్టడం అలవాటు

ABN, Publish Date - Nov 06 , 2025 | 09:22 AM

'టాక్సిక్‌’ (Toxic) సినిమా విషయంలో మేమేమి  భయపడడం లేదు. సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను. ప్రేక్షకులు ఊహించని చోట వాళ్లను ఆశ్చర్యపరచడం నా అలవాటు.

'టాక్సిక్‌’ (Toxic) సినిమా విషయంలో మేమేమి  భయపడడం లేదు. సైలెంట్‌గా వచ్చి విజయం సొంతం చేసుకుంటాను. ప్రేక్షకులు ఊహించని చోట వాళ్లను ఆశ్చర్యపరచడం నా అలవాటు. ఇక ఒకేసారి రెండు సినిమాలు విడుదలై హిట్‌లు సొంతం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి నాకొచ్చిన భయమేమీ లేదు' అని అడివి శేష్ (Adivi Sesh)అన్నారు. అయన కథానాయకుడిగా శానీల్  డియో (Shaneil Deo) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'డెకాయిట్'(Dacoit) . మృణాల్ ఠాకూర్ కథానాయిక.  మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.  ఇదే రోజున  యశ్‌ (Yash) హీరోగా నటిస్తోన్న ‘టాక్సిక్‌’ కూడా విడుదల కానుంది.  ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్‌ వార్‌ ఖాయమనే కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. . తాజాగా దీనిపై అడివిశేష్‌ స్పందించారు.  

'ఒకే తేదీలో రెండు సినిమాలు విడుదల కావడం కొత్తేమీ కాదు. అలా విడుదలై సక్సెస్ అయినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 2018లో యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌’ షారుక్‌ ‘జీరో’ ఒకేసారి విడుదలయ్యాయి. రెండూ ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా అంతే మా రెండు చిత్రాలు హిట్ అవుతాయని నాకు నమ్మకం ఉంది. రెండు సినిమాలు ఒకేరోజు విడుదలైతే  వాటిలో ఒకటి ఫ్లాప్‌ అవుతుందనేది పూర్తిగా అసత్యం.  విజేత ఎవరనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. ఒకప్పుడు ‘లగాన్‌’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ ఒకేసారి వచ్చి బ్లాక్‌బస్టర్‌ విజయాలను సొంతం చేసుకున్నాయి. బాక్సాఫీస్‌ వార్‌ అనేది మీడియా సృష్టించిన ఒక పదం అంతే.  ప్రేక్షకులు దానిని అసలు పట్టించుకోరు. కథ బాగుంటే అదే  ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. అదే సందర్భంలో ఏదైనా పండగ వస్తే ఆ సందడి మరింత రెట్టింపు అవుతుంది' అని అన్నారు.   

Updated Date - Nov 06 , 2025 | 09:39 AM