adivi sesh : అడివి శేష్ కోసం నాగ్ సాంగ్

ABN , Publish Date - Dec 19 , 2025 | 01:38 PM

మంచి సినిమా చేయడం కాదు… దానిని ప్రమోట్ చేసుకోవడం కూడా తెలిసి ఉండాలి.. అందుకే ఆ విషయంలో ఆ హీరో చాలా తెలివిని ప్రదర్శిస్తున్నాడు. సినిమాకు కావాల్సినంత హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు. హీరోగారి తెలివితేటలు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

టాలీవుడ్ లో ఇప్పుడు టైర్ 2 హీరోల్లో సక్సెస్ లతో దూసుకుపోతున్న యంగ్ హీరో ఎవరంటే అడివి శేష్ పేరు వినిపిస్తుంది. వరుసగా సినిమాలు చేయడమే కాదు.. వరుస విజయాలతోనూ దూసుకుపోతున్నాడు. 'క్షణం'తో మొదలైన అతని విజయ యాత్ర 'హిట్ 2' సినిమా వరకు … వరుస సక్సెస్ లతో కొనసాగుతోంది. అయితే ఇదే పరంపరను అప్ కమింగ్ మూవీతో కంటిన్యూ చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు ఈ యంగ్ హీరో.


డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అడివిశేష్ నుంచి సినిమా వస్తుందంటే చాలు బొమ్మ హిట్ అని ఫిక్సైపోతున్నారు ఆడియన్స్. అందుకే ఇప్పుడు తన స్థాయిని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లేందుకు అదిరిపోయే స్కెచ్ వేశాడు శేష్. ప్రెజెంట్' డెకాయిట్' తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో ఆ మూవీకి కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేస్తున్నాడు. జస్ట్ టీజర్ తోనే సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఇప్పటికే 'మేజర్'తో నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న శేష్ ఇప్పుడు 'డెకాయిట్' ద్వారా తన మార్కెట్ ను మరింత విస్తరించాలనే క్లారిటీతో ముందుకెళ్తున్నాడు. టీజర్ రెస్పాన్స్ చూస్తే.. ఆ దిశగా అడుగులు బలంగా పడుతున్నాయనే చెప్పాలి.


అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా షానీల్ డియో దర్శకత్వంలో వస్తున్న' డెకాయిట్' టీజర్ సంచనాలకు కేరాఫ్ గా మారింది. యాక్షన్ తో కూడిన ఈ టీజర్ బ్యాక్ గ్రౌడ్ లో ‘కన్నెపిట్టరో కన్నుకొట్టరో’ పాట ప్లే అవుతోంది. అక్కినేని నాగార్జున నటించిన ‘హలో బ్రదర్’ లోని ఈ ఎవర్ గ్రీన్ సాంగ్ కు అడివి శేష్ యాక్షన్ షేడ్స్ జోడివ్వడం టీజర్ కు హైలైట్ గా నిలిచింది. అంతేకాక 'డాక్టర్ని కాదు దొంగని' అనే అడివి శేష్ డైలాగ్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఐకానిక్ పాటను రీమిక్స్ చేయాలన్న ఆలోచన నిర్మాత సుప్రియ సూచించారని శేష్ తెలియచేశాడు. భారీ అంచనాలున్న ఈ మూవీ మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాలనే అడవి శేష్ ప్లాన్ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Read Also: Chiranjeevi Hanuman: ‘చిరంజీవి హనుమాన్‌ -ది ఎటర్నల్‌’ తొలి ఏఐ థియేట్రికల్‌ సినిమా

Read Also: Nidhhi Agerwal: నిధీ అగర్వాల్‌ ఫిర్యాదు చేస్తే మరో కేసు ఫైల్‌ చేస్తామంటున్న పోలీసులు

Updated Date - Dec 19 , 2025 | 01:53 PM