సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dacoit: మళ్లీ వాయిదా పడ్డ డెకాయిట్..

ABN, Publish Date - Oct 06 , 2025 | 07:05 PM

కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతంగూఢచారి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా శేష్ నటిస్తున్న మరో చిత్రం డెకాయిట్ (Dacoit).

Dacoit

Dacoit: కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రస్తుతంగూఢచారి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది కాకుండా శేష్ నటిస్తున్న మరో చిత్రం డెకాయిట్ (Dacoit). షానియేల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. ఈ సినిమాలో మొదట శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. సగం సినిమా షూటింగ్ పూర్తయ్యాక కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది. ఇక శృతి హాసన్ ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరింది.


మృణాల్ వచ్చాకా మరోసారి రీ షూట్ చేయడం జరిగింది. దీంతో మొదట అనుకున్న రిలీజ్ వాయిదా పడి ఈసారి డిసెంబర్ 25 కి వస్తున్నట్లు మేకర్స్ ఈ మధ్యనే ప్రకటించారు. అయితే అదే డేట్ న రోషన్ మేక ఛాంపియన్ కూడా రిలీజ్ కానుందని మేకర్స్ నేడు ప్రకటించారు. దీంతో మరోమారు డెకాయిట్ వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మృణాల్ రీషూట్ వలన షూటింగ్ ఫినిష్ కాకపోవడం ఒక కారణమైతే.. డెకాయిట్ షూటింగ్ లో అడివి శేష్ కు ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే.


షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుంచి శేష్ ఇంకా కోలుకోకపోవడం వలన కొంత ఆలస్యం అయ్యిందట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ ఉన్నాయని, ఇవన్నీ డిసెంబర్ లోపు పూర్తికావని తెలిసి మేకర్స్ ఈ క్రిస్టమస్ రేస్ నుంచి డెకాయిట్ ను తప్పించినట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ క్రిస్టమస్ కు డెకాయిట్ వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.

Dhanush: గ్రామస్తులకు.. హీరో ధనుష్ విందు

Akkineni Nagarjuna: లాటరీ కింగ్‌గా.. మారిన నాగార్జున.

Updated Date - Oct 06 , 2025 | 07:05 PM