Dacoit: అడివి శేష్ క్రిస్టమస్ వదిలేసి ఉగాది మీద పడ్డాడే
ABN , Publish Date - Oct 28 , 2025 | 02:20 PM
కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెకాయిట్ (Dacoit).
Dacoit: కుర్ర హీరో అడివి శేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డెకాయిట్ (Dacoit). సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుంటే ఈ ఏడాదే డెకాయిట్ రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వలన వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది.
మొదట శృతి హాసన్ ను హీరోయిన్ గా అనుకోని కొంతవరకు షూటింగ్ చేశారు. ఆ తరువాత ఆమె వెళ్లిపోవడంతో ఆమె ప్లేస్ లో మృణాల్ ను తీసుకొని అవే సీన్స్ ను రీషూట్ చేయడంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయినా చివరకు క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న రిలీజ్ చేయాలనీ ప్రయత్నించారు. దానికి తగ్గట్టే షూటింగ్ కూడా శరవేగంగా షూటింగ్ ను ఫినిష్ చేయాలనీ ప్రయత్నించారు. అయితే షూటింగ్ లో శేష్ ప్రమాదానికి గురయ్యాడు. దానివలన షూటింగ్ మళ్లీ వాయిదా పడింది.
ఇప్పుడిప్పుడే శేష్ కోలుకొని షూటింగ్ కు వెళ్తున్నట్లు సమాచారం. ఎంత ప్రయత్నించినా అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకులకు అందించలేమని తెలుసుకున్న మేకర్స్ మరోసారి ఈ సినిమాను వాయిదా వేశారు. క్రిస్టమస్ పండగ మిస్ అయితే ఏంటి.. ఉగాది ఉంది కదా అంటూ శేష్.. ఉగాది మీద పడ్డాడు. డెకాయిట్ మార్చి 19 న రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఈసారి మాములుగా ఉండదు..ఇక వెనక్కి చూసే అవసరం లేదు అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో పాటు కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇందులో కారులో శేష్, మృణాల్ వెనక్కి తిరిగి సీరియస్ గా చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి అయినా శేష్ .. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.
Mega 158: మొన్న కార్తీ.. నేడు అనురాగ్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బాబీ
Mythri Movie Makers: 'ఉప్పెన' బాటలో 'డ్యూడ్'....