సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dacoit: ఎట్ట‌కేల‌కు.. అడ‌వి శేష్ సినిమా వ‌చ్చేస్తోంది... డెకాయిట్ రిలీజ్ డేట్ ఇదే

ABN, Publish Date - May 26 , 2025 | 12:23 PM

'మేజర్‌', 'హిట్‌–2' చిత్రాల సక్సెస్‌ తర్వాత మూడేండ్ల విరామం తీసుకున్న అడ‌వి శేష్ న‌టిస్తోన్న నూత‌న చిత్రం డెకాయిట్. ఈ మూవీ నుంచి ఎట్ట‌కేల‌కు ఓ ఆప్డేట్ వ‌చ్చింది..

Dacoit,

'మేజర్‌', 'హిట్‌–2' చిత్రాల సక్సెస్‌ తర్వాత మూడేండ్ల విరామం తీసుకున్న అడ‌వి శేష్ (Adivi Sesh) న‌టిస్తోన్న నూత‌న చిత్రం డెకాయిట్ (Dacoit) .‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన షానీల్‌ డియో (Shaneil Deo) దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఏడాది క్రిత‌మే శృతి హాస‌న్ హీరోయిన్‌గా ప్రారంభ‌మైన ఈ చిత్రం నుంచి శృతి మ‌ధ్య‌లో త‌ప్పుకోవ‌డంతో చాలా రోజులు వాయిదా ప‌డింది. త‌ర్వాత గ్యాప్ తీసుకున్న మేక‌ర్స్ చాలామంది నాయిక‌ల‌ను జ‌ల్లెడ ప‌ట్టి మృణాల్‌ ఠాగూర్ (Mrunal Thakur)ను సెల‌క్ట్ చేసి సినిమాను మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ( Annapurna Stdios) బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో S.S క్రియేష‌న్స్‌, సునీల్ నారంగ్ ప్రోడ‌క్ష‌న్స్ తో క‌లిసి సుప్రియ యార్లగడ్డ (Supriaya Yarlagadda) నిర్మిస్తుంది. ఈ చిత్రంతో ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) టాలీవుడ్‌లో అడుగు పెడుతుండ‌గా ప్ర‌కాశ్ రాజ్ (Prakash Raj), అతుల్ కుల‌క‌ర్ణి, సునీల్, జైన్ మేరీ ఖాన్, కామాక్షి భాస్క‌ర్ల (Kamakshi Bhaskarla) ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చి రిలీజ్ డేట్‌ను సైతం ప్ర‌క‌టించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తాజాగా విడుద‌ల చేసిన గ్లిమ్స్ సినిమాలో పెద్ద విష‌య‌మే ఉందని చెబుతూ ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీని క‌లిగించేలా ఉంది.

Updated Date - May 26 , 2025 | 12:48 PM