Bhartha Mahasayulaku Wignyapthi: అద్దం ముందు నిలబడి.. భీమ్స్ మెలోడీలో కూడా తోపే
ABN , Publish Date - Dec 10 , 2025 | 07:01 PM
మాస్ మహారాజా రవితేజ (Raviteja ) హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi).
Bhartha Mahasayulaku Wignyapthi: మాస్ మహారాజా రవితేజ (Raviteja ) హీరోగా కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi). SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), డింపుల్ హయతీ (Dimple Hayathi) నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి పోరులో ఈ సినిమా కూడా నిలబడింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచేసిన మేకర్స్ వరుసగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలోని రెండో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. అద్దం ముందు నిలబడి అంటూ సాగే సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ,మాస్ సాంగ్స్ కు భీమ్స్ సిసిరోలియో పెట్టింది పేరు అనుకున్నారు. కానీ, మెలోడీలకు కూడా భీమ్స్ తోపే అని ఈ సాంగ్ వింటుంటే తెలుస్తోంది. సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక విజువల్ గా కూడా చాలా అంటే చాలా బావుంది. రవితేజ, డింపుల్ పెయిర్ ని ఇప్పటికే ఖిలాడీ మూవీలో చూసాం.. మరోసారి ఈ జంట రొమాన్స్ తో అదరగొట్టారు. ఇక చంద్రబోస్ రాసిన లిరిక్స్ చాలా సింపుల్ గా ఉన్నా కూడా చాలా అందంగా, క్యాచీగా, రైమింగ్ తో అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ సాంగ్ ను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ తమ వాయిస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. ప్రేమలో ప్రేమికుడు చేసే ప్రతి పని ప్రియురాలికి నచ్చుతుంది. ప్రియుడికి.. ప్రియురాలే పంచ ప్రాణాలు. ఇక ఈ లిరిక్స్ లో కూడా చంద్రబోస్ అవే రాశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతోనైనా రవితేజ మంచి విజయాన్ని అందుకుంటాడా.. ? లేదా అనేది చూడాలి.