సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Actress Vahini: క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్‌.. ఐసీయూలో న‌టి!

ABN, Publish Date - Dec 13 , 2025 | 08:57 AM

సహాయనటిగా.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి వాహిని (Actress Vahini) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు.

Actress Vahini

సహాయనటిగా.. టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న న‌టి వాహిని (Actress Vahini) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు మ‌రో నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సహాయనటిగా కెరీర్‌ ప్రారంభించిన వాహిని. తెలుగు, తమిళంలో అనేక సినిమాలు చేసినప్పటికీ బుల్లితెర నటిగానే ఎక్కువ గుర్తింపు పొందారు.

ఈ ఏడాది విడుదలైన 'పోలీస్ వారి హెచ్చరిక సినిమాలోనూ నటించారు. కాగా, వాహినిని ఆదుకోవాలంటూ నటి కరాటే కళ్యాణి (Kalyani Padala) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టారు. 'ఆర్టిస్ట్ జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. మద్రాస్ నడిగర సభ్యత్వం ఉండి తెలుగు సినిమాల్లో చాలా పాత్రలు పోషించి.. అప్పుడప్పుడు సీరియల్స్‌లో మెరుస్తున్నారు పద్మక్క అలియాస్ వాహిని.

కొన్ని నెలలుగా ఆమె రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్యం విషమించింది. బహుళ అవయవాలు దెబ్బతిన్నాయి. చికిత్సకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు అవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. అంత ఖర్చును ఆమె కుటుంబం భరించలేదు. దయచేసి ఆమె త్వరగా కోలుకునేందుకు సహాయం చేయండి' అని కోరారు.

Updated Date - Dec 13 , 2025 | 08:57 AM