సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sreeleela: వరంగల్‌లో.. శ్రీలీల సందడి! కిక్కిరిసిపోయిన స్టేషన్ రోడ్లు

ABN, Publish Date - Nov 06 , 2025 | 05:47 PM

వరంగల్ స్టేషన్ రోడ్‌లో సినీ నటి శ్రీలీల రాకతో హడావిడి వాతావరణం నెలకొంది. ఓ వస్త్ర దుకాణం ప్రారంభానికి ఆమె హాజరుకాగా, అభిమానులు భారీగా తరలి వచ్చారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Sreeleela

వరంగల్ నగరంలో సినీనటి, డ్యాన్సింగ్ క్వీన్‌ శ్రీలీల (Sreeleela) గురువారం సందడి చేసింది. స్టేషన్ రోడ్ లో ఓ వస్త్ర దుకాణం ఓపెనింగ్ కు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా శ్రీలీల‌ను చూసేందుకు జనం, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో ఆ ఏరియా అంతా ఇసుకేస్తే రాల‌నంత‌గా ప్ర‌జ‌ల‌తో కిక్కిరిసిపోయింది.

అభిమానుల ఈలలు, కేరింతలతో గోలగోల చేశారు. అభిమానులను చూసి ఆమె కూడా అభివాదం చేశారు. శ్రీలీల రాక సందర్భంగా ప్రధానమైన స్టేషన్ రోడ్డు కిక్కిరిసిపోయింది. ఫోటోలు, సెల్ఫీల కోసం అభిమానులు ఎగ‌బ‌డ్డారు. ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది.

శ్రీలీలను చూడాలని పెద్ద సంఖ్యలో అభిమానులు, నగర ప్రజలు స్టేషన్ రోడ్‌కు తరలివచ్చారు. ఆమె కార్ దగ్గరకు చేరగానే అభిమానులు ఈలలు, కేరింతలతో హర్షధ్వానాలు చేశారు. వారిని చూసి శ్రీలీల కూడా చిరునవ్వుతో చేతులు ఊపుతూ అభిమానులకు అభివాదం చేశారు.

ఈ క్రమంలో ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ కొంతసేపు నిలిచిపోయింది. భారీ జనసందోహం కారణంగా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 06 , 2025 | 05:47 PM