సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nayan Sarika: ద‌గ్గ‌ర్లో బార్.. ఏమైనా ఉందా అంటున్న.. న‌య‌న్ సారిక‌! శ్రీవిష్ణు జోడీగా సినిమా

ABN, Publish Date - Oct 23 , 2025 | 08:01 PM

గ‌తేడాది గం గ‌ణేశా, ఆత త‌ర్వాత‌ దీపావ‌ళికి ఆయ్‌, క వంటి సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టింది యువ క‌థానాయిక న‌య‌న్ సారిక

Nayan Sarika

గ‌తేడాది గం గ‌ణేశా, ఆత త‌ర్వాత‌ దీపావ‌ళికి ఆయ్‌, క వంటి సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టింది యువ క‌థానాయిక న‌య‌న్ సారిక (Nayan Sarika). త‌ర్వాత ఏడాదిగా మాయ‌మై స‌డ‌న్‌గా ఇన్నాళ్లకు మ‌రో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌గా పేరు సంపాదించుకున్న‌ శ్రీ విష్ణు (Sree Vishnu) క‌థానాయుకుడిగా తెర‌కెక్కనున్న ఓ క్రేజీ సినిమాలో క‌థానాయిక‌గా సెల‌క్ట్ అయింది. ఇంకా పేరు పెట్ట‌ని ఈ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే మొద‌ల‌యింది.

ఈ రోజు (గురువారం) సారిక పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని మేక‌ర్స్ బ‌ర్త్‌డే విషెష్ తెలుపుతూ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌గా స్వ‌యంగా ఆమె పైనే ఓ గ్లిమ్స్ వీడియో త‌యారు చేసి రిలీజ్ చేయ‌డం విశేషం. అమె ద్వారానే క్యాస్ట్ అండ్ క్రూ వివ‌రాలు చెప్పించి చివ‌ర్లో ద‌గ్గ‌ర్లో మంచి బార్ ఏమైనా ఉందా అనే డైలాగ్‌తో ముగించారు.

ఈ చిత్రంతో యదునాథ్ మారుతీ రావు (Yudunaath Maruthirao) ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తుండ‌గా సుమంత్ నాయుడు జి నిర్మాణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతోంది. హేమ, షాలిని ఈ సినిమాను సమర్పిస్తున్నారు., సుబ్రహ్మణ్యం నాయుడు, రామాచారి ఎం సహ నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఒంగోలు నేపథ్యంలో ఔట్ అండ్ ఔట్ ఫ‌న్‌ ఎంట‌ర్టైన్‌గా సాగే ఈ కథలో శ్రీ విష్ణు తన సిగ్నేచర్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అల‌రించ‌నున్నాడు. ఇంకా ఈ ఈ చిత్రంలో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ప్రమోదిని వంటి న‌టులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రధన్ (Radhan) సంగీతం అందించ‌నున్నాడు.

Updated Date - Oct 23 , 2025 | 08:26 PM