Actress Hema: లైఫ్ అంతా పరుగెడుతూనే ఉన్నా.. ఎంజాయ్ లేదు..
ABN, Publish Date - Oct 04 , 2025 | 04:01 PM
‘నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా నిందలు మోపారు. డిప్రెషన్‌కి లోనై చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది’ అని నటి హేమ అన్నారు.
‘నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా నిందలు మోపారు. డిప్రెషన్‌కి లోనై చచ్చిపోవాలనిపించింది లేదంటే ఎవరినైనా చంపేయాలనిపించింది’ అని నటి హేమ (Hema) అన్నారు. వందల చిత్రాల్లో నటించిన ఆమె కొన్నాళ్లుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘సినిమాల్లోకి వచ్చి 37 ఏళ్లు అవుతుంది. కెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తను రిజర్వ్‌డ్‌గా ఉంటారు. బయటకు వెళ్దామన్నా రారు. పొద్దున్నే లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్‌కు వెళ్లేదాన్ని. మళ్లీ ఇంటికి రాగానే అదే పని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తడంతో లైఫ్‌లో ఎంజాయ్‌మెంట్ లేకుండా పోయింది. లాక్‌డౌన్‌లో 40 ఏళ్ల వయసుకు చేరుకున్నా. శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. నాకు ఎవరి టార్చర్ లేదు. కానీ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. (Hema in Depression) తెలియకుండా కోపం బాధ పెరిగిపోయాయి. రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్న తరుణంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఆ షోకి వెళ్లి అందరికీ బాగా వండిపెట్టా. వారం రోజులకే ఎలిమినేట్ అయి వచ్చేశా. ఆ షో వల్ల చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్లతో సరదగా గడుపుతుంటా. అలా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చా. కానీ 2024లో అనుభవించని కష్టాలకు విసుగొచ్చింది. ఒక సందర్భంలో చచ్చిపోవాలనిపించింది లేదా ఎవరినైనా చంపేయాలనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది.