సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Rashmika Engagement: విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్నా నిశ్చితార్థం.. ఫిబ్రవరిలో పెళ్లి!

ABN, Publish Date - Oct 03 , 2025 | 10:50 PM

టాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌గా ఎప్పటినుంచో హాట్‌టాపిక్‌గా మారిన విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్నా జంట ఇక అధికారికంగా జీవిత భాగస్వాములుగా మారే దిశగా అడుగులు వేసింది.

Vijay Rashmika Engagement:

టాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌గా ఎప్పటినుంచో హాట్‌టాపిక్‌గా మారిన విజయ్‌ దేవరకొండ – రష్మిక మందన్నా జంట ఇక అధికారికంగా జీవిత భాగస్వాములుగా మారే దిశగా అడుగులు వేసింది. చాలా కాలంగా వీరి రిలేషన్‌పై రకరకాల వార్తలు వినిపించినా, ఇరువురూ ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఈ రోజు (శుక్ర‌వారం) ఉదయం హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ నివాసంలో అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం వేడుక సింపుల్‌గా, అందంగా జరిగిపోయింది.

ఈ వేడుకకు ఇరువురి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహిత స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఎలాంటి మీడియా హంగామా లేకుండా చాలా ప్రైవేట్‌గా నిర్వహించారని సమాచారం. వేడుకలో ఇరువురి ఆనందం చూసి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

అయితే.. ఇప్పుడు ఇరువురి కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమవుతుండ‌గా ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుందని విశ్వసనీయ సమాచారం. ప్రముఖ సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందినవారంతా ఆ వివాహ వేడుకలో పాల్గొనే అవకాశం ఉందని టాలీవుడ్‌ టాక్‌. అయితే ఇటీవ‌ల విదేశాల‌లో ఫొటో షూట్ చేయ‌గా అంతా అది క‌మ‌ర్షియ‌ల్ యాడ్ అని అంతా అనుకున్నారు. తీరా చూస్తే అది వీరి ఎంగేజ్ మెంట్‌కు ముందు చేసిన షూట్ అని తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. విజయ్‌ – రష్మికలు ఇప్పటికే కలిసి నటించిన గీతగోవిందం, డియర్‌ కామ్రేడ్ సినిమాల ద్వారా రొమాంటిక్‌ కెమిస్ట్రీతో మిలియన్ల ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నారు. అప్పటినుంచి వీరి జంటపై అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన అటాచ్‌మెంట్‌ ఏర్పడింది. ఇప్పుడు వీరి వివాహం అధికారికమవుతుందన్న వార్తతో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ ఆనందంతో మునిగిపోయారు. ఇప్పటికే అభిమానులు, నెటిజన్లు #VijayRashmikaWedding హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌మీడియాలో ట్రెండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 03 , 2025 | 10:57 PM