డ్రగ్స్ కేసులో నటుడు రశ్రీరామ్ అరెస్టు
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:16 AM
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో...
డ్రగ్స్ కేసులో తమిళ, తెలుగు చిత్రాల నటుడు శ్రీరామ్ (శ్రీకాంత్)ను చెన్నై నార్కోటిక్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనకు జరిపిన వైద్య ప్రాథమిక పరీక్షల్లో ‘సైకోట్రాఫిక్’ రకం డ్రగ్‌ను తీసుకున్నట్టు తేలింది. ‘తీంగిరై’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సమయంలో డ్రగ్స్ కావాలని నటుడు శ్రీరామ్ కోరగా, కెనడా దేశానికి చెందిన డ్రగ్ ఫెడ్లర్ జాన్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఇచ్చినట్లు ప్రదీప్‌కుమార్ అనే వ్యక్తి పోలీసుల వద్ద అంగీకరించాడు. దీంతో జాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసి, అతని నుంచి 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా సోమవారం ఉదయం నుంగంబాక్కంలోని శ్రీరాం నివాసానికి వెళ్ళి విచారించగా, డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించడంతో స్టేషన్‌కు తీసుకొచ్చి మరింత లోతుగా విచారణ జరిపారు. ఆ తర్వాత కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్ళి రక్తం శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు చేయగా, పాజిటివ్‌గా తేలింది. దీంతో పోలీసులు శ్రీరాంను అరెస్టు చేశారు. డ్రగ్స్ కొనుగోలు కోసం శ్రీరామ్ రూ.72 వేల వరకు డ్రగ్ ఫెడ్లర్‌కు చెల్లించినట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
చెన్నై (ఆంధ్రజ్యోతి)