Pavala Syamala : అద్దె ఇంటి నుండి అనాథ ఆశ్రమానికి... ఇప్పుడు హాస్పిటల్ కు...
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:25 AM
సీనియర్ నటి పావలా శ్యామల అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. అద్దె ఇంటి నుండి కొంతకాలం క్రితం అనాథ ఆశ్రమానికి చేరుకున్న ఆమె, తనకు, తన కూతురుకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఇప్పుడు హాస్పిటల్ లో చేరారు. ఆర్థిక సాయం కోసం పావలా శ్యామల అర్థిస్తున్నారు.
వెండితెరపై ఒకప్పుడు తనదైన శైలిలో నటించి, నవ్వులు పూయించిన పావలా శ్యామల (Pavala Syamala) ప్రస్తుతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఆమె హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రేక్షకులను నవ్వించిన ఆ పెదవులు ఇప్పుడు సాయం కోసం ఆర్థిస్తున్నాయి. ఆమె జీవితపు చివరి దశలో ఆమె చిగురుటాకులా వణికిపోతున్నారు.
రంగస్థలం నుండి చిత్రసీమలోకి అడుగుపెట్టిన పావలా శ్యామల ప్రముఖ హీరోల చిత్రాలలో నటించారు. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్యనటిగా ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండేది. అమ్మగా, అత్తగా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆమె కొట్టుమిట్టాడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తో పాటు సినీ ప్రముఖులు, జర్నలిస్ట్ సంఘాలు సైతం ఆమెకు ఎప్పటికప్పుడు తగిన ఆర్థిక సాయం చేస్తూనే వస్తున్నాయి. అయితే... ఆర్థికంగా కుదేలు కావడంతో పాటు ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా ఆమె అనాధాశ్రమంలో ఉంటున్నారు. తన కూతురు కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో మంచానికే పరిమితం కావడంతో శ్యామల మరింత దిగులు పడిపోయారు. ఎవరైనా మనసున్న వాళ్ళ తనకు, తన కూతురికి ఆర్థిక సాయం చేయమని ఆమె కోరుతున్నారు. మరి పావలా శ్యామల విజ్ఞప్తిని ఆలపించి, సినిమా రంగంలోని ప్రముఖులు ముందుకు వస్తారేమో చూడాలి.
Also Read: Devisri Prasad: హీరోగా మ్యూజిక్ మిసైల్... హీరోయిన్ కూడా ఫిక్స్
Also Read: Bandla Ganesh: బండ్ల ఇంట దీవాళీ బాష్.. ఇండస్ట్రీ మొత్తం హాజరు.. మరి అల్లు అరవింద్..?