సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Shivaji: క్షమించండి.. మహిళల విషయంలో ఆ పదాలు వాడటం తప్పే

ABN, Publish Date - Dec 23 , 2025 | 07:13 PM

‘దండోరా’ (Dhandora) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల  క్షమాపణ (Sivaji apology) చెప్పారు

Shivaji

‘దండోరా’ (Dhandora) సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరోయిన్ల దుస్తుల గురించి నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల  క్షమాపణ (Sivaji apology) చెప్పారు. హీరోయిన్‌ల అందం వాళ్లు వేసుకునే డ్రెస్‌లోనే ఉంటుందంటూ, ఎక్స్‌పోజ్‌ చేయడం అందం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి క్షమాపణ కోరుతూ ఓ వీడియో రిలీజ్‌ చేశారు.  అందులో శివాజీ మాట్లాడుతూ ‘మంచి మాటలు చెప్పే ఉద్దేశంలో రెండు అసభ్య పదాలు దొర్లాయి. వాటి వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలి’ అని అన్నారు.

‘ఇటీవల పలువురు హీరోయిన్స్‌ ఇబ్బంది పడిన సందర్భం గురించి చెబుతూ  ‘దండోరా’ ఈవెంట్‌లో మాట్లాడాను. నాలుగు మంచి మాటలు చెబుతూనే రెండు అసభ్య పదాలను ఉపయోగించా. వాటి వల్ల ఎవరికైనా మనోభావాలు దెబ్బ తింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు. ‘బయటకు వెళ్లినప్పుడు మంచి దుస్తులు వేసుకుని ఉంటే మీకు ఈ ఇబ్బంది ఉండేది కాదేమోనమ్మా’ అనే ఉద్దేశం తప్ప, ఎవరినీ కించపరచాలని కాదు. తక్కువ చేయాలని కాదు.

ఏదైనా రెండు అసభ్య పదాలు దొర్లాయి. అందుకు క్షమాపణలు చెబుతున్నా. స్త్రీ అంటే శక్తి. నేను అమ్మవారిగా భావిస్తా. ప్రస్తుత సమాజంలో మహిళను తక్కువగా చూస్తున్నారు. అటువంటి అవకాశం ఇవ్వవద్దని చెప్పే ఉద్దేశంతో ఊరి భాష మాట్లాడా. ఆ పదాలు వాడకుండా ఉంటే బాగుండేది. ఒకటి మాత్రం చెబుతున్నా, మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే అలా అన్నాను’ అని అన్నారు.

ఇదిలా ఉంటే... దీనికి ముందు శివాజీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటే తెలుగు చిత్రసీమకు చెందిన దర్శకురాలు నందినీరెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నాదత్, లక్ష్మీమంచు, నటి ఝాన్సీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే శివాజీ వ్రాతపూర్వకంగానూ తన క్షమాపణలను 'మా' అసోసియేషన్ కు పంపారు. దానిని జత చేస్తూ ఈ విషయానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నట్టుగా 'మా' ప్రెసిడెంట్ విష్ణు తెలిపారు.
 

Updated Date - Dec 23 , 2025 | 08:27 PM