సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhandoraa Shivaji: ఇలాంటి సినిమా.. కొన్ని తరాలకు ఒకటి వస్తుంది

ABN, Publish Date - Dec 27 , 2025 | 10:09 AM

ఈ సినిమా చూసి మలయాళ దర్శకుడు మారి సెల్వరాజ్‌ తో మురళీకాంత్‌ను పోల్చుతూ అందరూ మాట్లాడుతుంటే మాకు చాలా గర్వంగా ఉందిని శివాజీ అన్నారు.

shivaji

‘హనుమాన్‌’ నిర్మాత ‘దండోరా’ (Dhandoraa) చిత్రం చూసి ప్రొడ్యూస్‌ చేయడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా గురించి 2026 సంవత్సరం మొత్తం మాట్లాడుకుంటారు. మలయాళ చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్‌ వంటి వారితో మురళీకాంత్‌ను పోల్చుతూ అందరూ మాట్లాడుతుంటే మాకు చాలా గర్వంగా ఉంది’ అని అన్నారు నటుడు శివాజీ (Shivaji).

ఆయనతోపాటు నవదీప్ (Navdeep), నందు (Nandu), బిందు మాధవి (Bindu Madhavi) ప్రధాన పాత్రధారులుగా మురళీకాంత్‌ తెరకెక్కించిన చిత్రమిది. సినిమా ఇటీవలె విడుదలైన సందర్భంగా చిత్రబృందం శుక్రవారం విజయోత్సవ వేడుకను నిర్వహించింది.

నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని మాట్లాడుతూ ‘సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు..విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వస్తున్నాయి’ అని అన్నారు. దర్శకుడు మురళీకాంత్‌ మాట్లాడుతూ ‘మూడున్నరేళ్ల మా కష్టం ఫలించింది’ అని ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 27 , 2025 | 10:09 AM