Satyadev: కింగ్‌డమ్ నుంచి.. సత్యదేవ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 04 , 2025 | 11:51 AM
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్‌డమ్ నుంచి సత్యదేవ్ లుక్‌ను మేకర్స్ శుక్రవారం రివీల్ చేశారు.
హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), భాగ్యశ్రీ భోర్సే (Bhagyashri Borse) జంటగా జర్సీఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కింగ్‌డమ్ (Kingdom). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పాటలు మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
అయితే ఇప్పటికే థియేటర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. సీజీ పనులు బ్యాలెన్స్ ఉండడం, కొన్ని సన్నివేశాలు రీ షూట్ చేస్తుండడం తదనంతర కారణాల వళ్ల అన్నింటిని పూర్తి చేసి ఈ సినిమాను చివరగా ఈ జూలైలో రిలీజ్ అవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో అప్పుడు కూడా కాదు ఆగష్టులో విడుదల అవనునట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ సినిమాలో మరో వెర్సటైల్ హీరో సత్యదేవ్ (Satyadev) కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. తాజాగా శుక్రవారం జూలై4న సత్యదేవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హ్యాపీ బర్త్ డే శివ అంటూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌లో సత్యదేవ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.