Prabhas: స్పిరిట్ లుక్ లీక్ చేసిన ప్రభాస్.. వంగా ఏం చేస్తాడో
ABN, Publish Date - Dec 05 , 2025 | 05:45 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఫౌజీ సగం షూటింగ్ ని కూడా ఫినిష్ చేసుకుంది. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ నటిస్తున్న చిత్రం స్పిరిట్(Spirit). సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ మధ్యనే పూజా కార్యక్రమాలను ఫినిష్ చేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు.
ఇక స్పిరిట్ లుక్ కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. వంగా కూడా ఆ లుక్ ను చాలా జాగ్రత్తగా ఉంచాలని ఎక్కడా లీక్స్ రాకుండా చూసుకుంటున్నాడు. మునుపెన్నడూ కనిపించని లుక్ లో డార్లింగ్ ఉండబోతున్నాడని సమాచారం. అందుకే 6 నెలల వరకు ప్రభాస్ కెమెరా కంటికి కనిపించకూడదని వంగా కండీషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ కండీషన్ ని ప్రభాస్ బ్రేక్ చేశాడు. స్పిరిట్ లుక్ తోనే డార్లింగ్ జపాన్ కు చెక్కేశాడు.
ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ జపాన్ లో కూడా రిలీజ్ కానుంది. ఈ సినిమా డిసెంబర్ 5, 6 తేదీల్లో జపాన్ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. దీంతో బాహుబలి ది ఎపిక్ ప్రీమియర్స్ కి నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ప్రభాస్ జపాన్ వెళ్ళాడు. అక్కడ జపాన్ అభిమానులతో కలిసి బాహుబలి ది ఎపిక్ చూసాడు. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి. డార్లింగ్ న్యూ లుక్ లో అదరగొట్టేశాడు. ఇది కచ్చితంగా స్పిరిట్ పోలీసాఫీసర్ లుక్కే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ లుక్ బయటకు రావడంపై వంగా ఏం అంటాడో చూడాలి.