Nani: ఈ ముసుగు వీరుడెవరు?
ABN, Publish Date - Aug 16 , 2025 | 05:22 AM
సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమా థియేటర్లకు వెళ్లరు. అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమా థియేటర్లకు వెళ్లరు. అక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. తప్పని సరి అయితే ఎవరూ తమను గుర్తించకుండా మారు వేషంలో వెళ్తారు. ఇటీవలె హీరోయిన్ రష్మిక మందన్న మారువేషంలో వెళ్లి విజయ్ దేవరకొండ సినిమా ‘కింగ్‌డమ్’ చూసి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా హీరో నాని కూడా ఇలానే గురువారం బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూశారు. ముఖానికి ముసుగు వేసుకొన్న నాని.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘వార్-2’, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలను ఏఎంబీ సినిమా్‌సలో వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.