సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఔత్సాహిక నటీనటుల కోసం గొప్ప వేదిక

ABN, Publish Date - Oct 18 , 2025 | 05:20 PM

రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ (paidi Jairaj) ప్రివ్యూ థియేటర్ లో ఔత్సాహిక నటీనటుల కోసం ఓ యాక్టింగ్ వర్క్‌షాప్ఏ (Acting work shop) ర్పాటు చేసారు. 

రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ (paidi Jairaj) ప్రివ్యూ థియేటర్ లో ఔత్సాహిక నటీనటుల కోసం ఓ యాక్టింగ్ వర్క్‌షాప్ఏ (Acting work shop) ర్పాటు చేసారు.  అన్నపూర్ణ క్రియేషన్స్, వినోద్ ఫిల్మ్ అకాడమీ, పాప్‌కార్న్ థియేటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కిషోర్ దాస్, వినోద్ ఫిల్మ్ అకాడమీ ఫౌండర్, నటులు నువ్వుల వినోద్ కుమార్, దర్శకులు తల్లాడ సాయికృష్ణ, సతీష్, ప్రణయ్ రాజ్ వంగరి అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులు ఈ వర్క్‌షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు.  నటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాత్రలో లీనమవడం, వాయిస్ మాడ్యులేషన్, భావోద్వేగాలను పలికించడం వంటి అనేక అంశాలపై విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం, వర్క్‌షాప్‌లో పాల్గొన్న దాదాపు 80 మంది ఔత్సాహిక నటీనటులకు సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది.

కిషోర్ దాస్ మాట్లాడుతూ 'నటన అనేది కేవలం కెమెరా ముందు నిలబడటం కాదు, అది ఒక సాధన. కొత్తగా సినిమా రంగంలోకి రావాలనుకునే వారు ముందుగా నటనలో మెళకువలు నేర్చుకోవాలి. ఏ పాత్రనైనా మన సొంతం చేసుకునే విధంగా ప్రదర్శించగలిగితేనే మీరు విజయం సాధిస్తారు. కష్టపడితే అవకాశాలు తప్పక వస్తాయి. సరైన వేదికను ఎంచుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలి'  అన్నారు.

నువ్వుల వినోద్ కుమార్ మాట్లాడుతూ 'సినిమా రంగం అనేది అద్భుతమైన వేదిక. కానీ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే పట్టుదల చాలా ముఖ్యం. నటనలో మెళకువలు నేర్పించడంతో పాటు, పరిశ్రమలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఎలా ప్రయత్నించాలి అనే విషయాలపై మా అకాడమీ ఎప్పుడూ యువతకు మార్గదర్శనం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని చేరుకోవడానికి కృషి చేయాలి' అన్నారు.

'దర్శకుడిగా మేము నటుల నుండి కోరుకునేది నైపుణ్యం, అంకితభావం. కొత్త నటీనటులు కేవలం గ్లామర్‌కు ఆకర్షితులు కాకుండా, నటనను ఒక వృత్తిగా గౌరవించాలి. ముఖ్యంగా, మంచి కథ, పాత్ర ఎంపికలో దర్శకులు ఎలాంటి అంశాలను పరిశీలిస్తారో తెలుసుకోవడం మీకు చాలా ఉపయోగపడుతుంది' అని దర్శకులు తల్లాడ సాయికృష్ణ అన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 05:27 PM